iDreamPost
android-app
ios-app

వీడియో: గుడిలో మోడ్రన్ దుస్తుల్లో యువతి.. దీపంతో సిగరెట్ వెలిగించి..

  • Published Jun 12, 2024 | 9:31 PM Updated Updated Jun 19, 2024 | 4:55 PM

Yougn Woman With Cigarette: గుడిలో మోడ్రన్ దుస్తుల్లో వెళ్తేనే అపచారం అని అంటారు. అలాంటిది ఈ యువతి ఏకంగా గుడిలో దీపంతో సిగరెట్ వెలిగించి మరీ హడావుడి చేసింది. ఆ తర్వాత ఏమైందంటే?

Yougn Woman With Cigarette: గుడిలో మోడ్రన్ దుస్తుల్లో వెళ్తేనే అపచారం అని అంటారు. అలాంటిది ఈ యువతి ఏకంగా గుడిలో దీపంతో సిగరెట్ వెలిగించి మరీ హడావుడి చేసింది. ఆ తర్వాత ఏమైందంటే?

వీడియో: గుడిలో మోడ్రన్ దుస్తుల్లో యువతి.. దీపంతో సిగరెట్ వెలిగించి..

దేవుడ్ని నమ్మేవాళ్ళు ఉంటారు. నమ్మనివాళ్ళు ఉంటారు. ఎవరి ఇష్టాలు వారివి. ఎవరి  జీవితం వారిది. ఎవరి నమ్మకాలు వారివి. అయితే ఇక్కడ ఎవరి నమ్మకాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఎవరినీ బలవంతపెట్టే అధికారమూ లేదు. దేవుడంటే నమ్మకం లేకపోతే నమ్మడం మానేయాలి. అంతేగానీ దూషించకూడదు. కానీ ఇటీవల కాలంలో దేవుడ్ని నమ్మేవాళ్ళని మూర్ఖులుగా చూడడం.. దేవుడ్ని దూషించడం వంటివి చేస్తున్నారు. పాపులర్ అవ్వడం కోసం దేవుడ్ని తిట్టడం ఇప్పుడొక ట్రెండ్. ఈ మధ్య పాపులర్ అవ్వడం కోసం అవేర్నెస్ పేరుతో షోయింగ్ వీడియోస్ చేస్తున్నారు.  

బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక యువతి గుడిలోకి ప్రవేశించింది. ఆమె తల్లి కూడా వచ్చారు. ఆమె ప్రదక్షిణలు చేస్తున్నారు. గర్భగుడిలో పూజారి మంగళహారతి ఇస్తున్నారు. ఇతర భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ సమయంలో ఆ యువతి మంగళహారతి ఇచ్చే దీపంతో సిగరెట్ వెలిగించింది. ఫోన్ లో మాట్లాడుతూ.. అటూ ఇటూ తిరుగుతూ ఒక పక్కకు వెళ్లి సిగరెట్ నోట్లో పెట్టుకుని కాసేపు హంగామా చేసింది. ఆ తర్వాత ఆమె తల్లి ఆమె వద్దకు వెళ్లి మందలించి సిగరెట్ లాక్కుని కింద పడేశారు. ఆ యువతి కోపంతో అక్కడ నుంచి వెళ్లిపోతుండగా కింద పడింది. యువతి తల్లి సహాయం కోసం అరుస్తున్నారు. కింద పడడంతో నడుముకి దెబ్బ తగిలినట్లు ఆ యువతి బాధపడుతోంది. అయితే ఇదంతా స్క్రిప్టెడ్ అని క్లియర్ గా అర్థమవుతుంది. కావాలని రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. 

3RD EYE అనే యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో ఉంది. అవేర్నెస్ కోసం ఈ ఛానల్ వాళ్ళు కొన్ని వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వీళ్ళు అప్లోడ్ చేసిన గుడిలో యువతి సిగరెట్ కాల్చే వీడియో మిస్ ఫైర్ అయ్యింది. దీంతో నెటిజన్స్ ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో అసంపూర్తిగా ఉందని.. ఈ యువతి తప్పు చేసిందని.. పైగా అవేర్నెస్ వీడియో అని ఎలా అంటారు అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు. అవేర్నెస్ కోసం చేసినట్టు లేదని.. వీడియో కోసమే చేసినా ఆ యువతి చేసింది తప్పే అని అంటున్నారు.

గమనిక:
ఈ ఆర్టికల్ లో చెప్పిన సమాచారం నిజంగా జరిగింది సంఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో మాత్రమే. దీన్ని.. సోషల్ మీడియాలో అందరూ వైరల్ చేయడంతో మేము పొరపాటున వార్తగా అందించడం జరిగింది. అంతే తప్ప.., ఈ స్క్రిప్టెడ్ వీడియోని వార్తగా కావాలని మేము క్రియేట్ చేయలేదు. జరిగిన పొరపాటు ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదని తెలియచేస్తున్నాము.