iDreamPost
android-app
ios-app

శిల్పి అరుణ్ యోగిరాజ్ కి రామమందిర రూపంలో స్వీట్ కానుక

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా రామనామ జపం వినిపిస్తుంది. దేశమంతా అయ్యోధ్య వైపే చూస్తున్నారు. జనవరి 22న రామవిగ్రహ పవిత్ర ప్రాణప్రతిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది.

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా రామనామ జపం వినిపిస్తుంది. దేశమంతా అయ్యోధ్య వైపే చూస్తున్నారు. జనవరి 22న రామవిగ్రహ పవిత్ర ప్రాణప్రతిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది.

శిల్పి అరుణ్ యోగిరాజ్ కి రామమందిర రూపంలో స్వీట్ కానుక

జనవరి 22న రామవిగ్రహ పవిత్ర ప్రాణప్రతిష్ట దగ్గరవుతుండగా దేశవ్యాప్తంగా ఈ సందర్భానికి సంబంధించిన అనేక అసక్తికర ఉదంతాలు బైటకొస్తున్నాయి. అందులో ప్రధానంగా 51 అంగుళాల రాములవారి నిలువెత్తు విగ్రహాన్ని రూపొందించిన మైసూర్ కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ పేరు కాశ్మీర్ టు కన్యాకుమారి మారుమోగుతోంది. ఈయన మైసూర్ నివాసి కావడంతో మైసూర్ పరిసరప్రాంతాలలో ఆరుణ్ యోగిరాజ్ కు అభిమానులు తామరతంపరగా పెరిగిపోతున్నారు. ఇప్పటి వరకు

500 సంవత్సరాల పోరాట ఫలితంగా జనవరి 22న సంచలనాత్మకంగా రామమందిరం ప్రారంభం కాబోతూండగా, ఇప్పటికే శ్రీరాముడు విగ్రహాన్ని కూడా గర్భగుడిలోకి తరలించడం వంటి కార్యక్రమాలతో దేశంలోని భక్తులు గుండెలు ఉద్వేగభరితంగా కొట్టుకుంటున్నాయి. తమకి చేరువుగా ఉన్న ఆరుణ్ చేతుల మీదుగా దేశం నలుమూలలా ప్రార్ధించి, పూజించే రాములవారి నిలువెత్తు పవిత్ర విగ్రహం రూపొందింది అనే పునీతభావన మైసూర్ వాసులు భావిస్తున్నారు.  అందుకనే అక్కడి అత్యంత ప్రముఖంగా ప్రసిద్ధి పొందిన స్వీట్ షాప్ శ్రీ మహాలక్ష్మి స్వీట్స్ ఒక విచిత్రమైన ఆలోచనతో శిల్పి అరుణ్ కుమార్ ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేకమైన స్వీట్ తయారుచేసి బహూకరించింది. అది….రామ మందిరం రూపంలో అన్ని రకాల స్వీట్స్ తో ఒక ఆకారాన్ని తయారుచేసి అరుణ్ యోగిరాజ్ కు ఈనాముగా అందించింది. ఇదిప్పుడు భారతదేశమంతా వైరల్ అయి అత్యంత ప్రాచుర్యం పొందింది.

ముందుగా ఆరుణ్ యోగిరాజ్ పేరును ప్రముఖ కర్ణాటక రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జనవరి 2న ప్రకటించారు. అరుణ్ యోగిరాజ్ గతంలో కేదరానాథ్ లో ప్రతిష్టించిన జగద్గురు ఆదిశంకారచార్యులవారి విగ్రహాన్ని, న్యూ ఢిల్లీ గేట్ దగ్గర ప్రతిష్టించిన నేతాజీ సుభాస్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా గతంలో అరుణ్ యోగిరాజే రూపొందించి పేరుప్రఖ్యాతులను సొంతం చేసుకున్నాడు. కర్ణాటకలోని అందరి రామభక్తులకు అరుణ్ యోగిరాజ్ గర్వకారణమని యడ్యూరప్ప అప్పట్లో ట్వీట్ కూడా చేశారు. రామ విగ్రహ రూపకల్పనలో తన అనుభవాలను చెబుతూ అరుణ్ ముఖ్యంగా రాములవారి విగ్రహాన్ని చెక్కుతున్నప్పుడు తన మనసులో ఓ పసివాడి ముఖాన్ని మాత్రమే నిలుపుకున్నట్టు, అలాగే విగ్రహలో దివ్యతవం ఉట్టిపడాలనే సంకల్పంతోనే తాను విగ్రహ రూపకల్పనకి ఉపక్రమించినట్టు తెలియజేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి