iDreamPost
android-app
ios-app

విద్యార్థితో టీచర్ శృంగారం.. స్కెచ్ వేసి పట్టుకున్న తల్లి!

  • Published Dec 16, 2023 | 9:13 PM Updated Updated Dec 16, 2023 | 9:13 PM

సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంటుంది. గురువు విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకువస్తారు.

సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంటుంది. గురువు విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి ఉన్నత స్థాయికి తీసుకువస్తారు.

విద్యార్థితో టీచర్ శృంగారం.. స్కెచ్ వేసి పట్టుకున్న తల్లి!

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. ఆ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా మార్చి సమాజంలో గొప్ప స్థాయికి తీసుకువచ్చేది గురువు. అందుకే గురు బ్రహ్మః, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరభ్రమ్మ, తస్మైశ్రీ గురవే నమః అని అంటారు. గురువుని సాక్షాత్తు ఆ త్రిమూర్తులతో పోలుస్తారు. సమాజంలో గురువుకి అంత గొప్ప స్థానం ఉంటుంది. కానీ ఈ మద్య కాలంలో కొంతమంది గురువు స్థానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. విద్యాలయానికి మద్యం సేవించి రావడం, విద్యార్థులను దారుణంగా దండించడం, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం లాంటివి చేస్తున్నారు. మరికొంత మంది టీచర్లు విద్యార్థులతో ఎఫైర్లు పెట్టుకోవడం లాంటి దారుణమైన పనులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

రగ్బీ ప్రాక్టీస్ అంటూ రోజూ ఓ విద్యార్థి (18) గ్రౌండ్ కి వెళ్తున్నాడు.. తన కొడుకు మంచి స్పోర్ట్స్ మ్యాన్ కావాలని ఆ తల్లి ఆశ. అందుకే ఆ తల్లి కొడుకు పై ఎక్కువగా దృష్టి పెట్టింది. అతని ప్రతి కదలికను గమనిస్తుంది. ఈ క్రమంలోనే సదరు విద్యార్థిని ఓ లేడీ టీచర్ (26) బుట్టలో వేసుకుంది.. అతనితో పలుమార్లు శృంగారంలో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే ఓ రోజు స్టూడెంట్ రగ్బీ ప్రాక్టీస్ కి వెళ్లలేదని తల్లికి తెలిసిందే. దీంతో కొడుకు ఆచూకీ కోసం లైఫ్ 360 యాప్ లో చెక్ చేసింది. తన కుమారుడు పార్క్ రోడ్ లో ఉన్నట్లు యాప్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంది. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా.. అక్కడ ఓ కారులో టీచర్ తో శృంగారంలో ఉండగా పసికట్టింది. వెంటనే టీచర్, కారు ఫోటోలు తీసి స్కూల్ యాజమాన్యానికి సదరు టీచర్ తన కోడుకుని ట్రాప్ చేసి అతని జీవితాన్ని నాశనం చేస్తుందని ఫిర్యాదు చేసింది.

స్టూడెంట్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో టీచర్ గాబ్రియాలా కార్టయాను అరెస్టు చేశారు. స్టూడెంట్ తో శృంగారం చేస్తున్నట్లు ఆమెపై ఆరోపణలు చేశారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్ తన సుఖం కోసం విద్యార్థిని పురిగొలిపి శృంగారంలో పాల్గొనేలా చేయడం చట్టరిత్యా నేరం అని కోర్టు ఆ టీచర్ కి జైలు శిక్ష విధించింది. వాస్తవానికి టీచర్ తో ఆ స్టూడెంట్ కి ఎఫైర్ ఉందని తల్లి గమనించింది.. అయితే రెడ్ హ్యాండ్ గా పట్టుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ క్రమంలోనే లైఫ్ 360 యాప్ తన సెల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని ఇద్దరిని పట్టుకుంది. 2008 లో ఈ యాప్ రిలీజ్ అయ్యింది. ఈ యాప్ ద్వారా ఫ్యామిలీ, ఫ్రెండ్ తమ లోకేషన్లు షేరు చేసుకువొచ్చు.. ఈ యాప్ కు దాదాపు 5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తతెలియజేయండి.