iDreamPost
android-app
ios-app

రూ.440 నష్టం.. రైల్వే ప్రయాణికుడి పోరాటంతో అద్భుత విజయం!

  • Published Nov 13, 2023 | 7:06 PM Updated Updated Nov 13, 2023 | 7:07 PM

ఇటీవల తమకు జరిగిన నష్టాన్ని కొంతమంది వినియోగదారులు కన్జ్యూమర్ కోర్టెు ద్వారా న్యాయం జరిగే వరకు పోరాడి ఫలితం దక్కించుకుంటున్నారు.

ఇటీవల తమకు జరిగిన నష్టాన్ని కొంతమంది వినియోగదారులు కన్జ్యూమర్ కోర్టెు ద్వారా న్యాయం జరిగే వరకు పోరాడి ఫలితం దక్కించుకుంటున్నారు.

రూ.440 నష్టం.. రైల్వే ప్రయాణికుడి పోరాటంతో అద్భుత విజయం!

ఈ మధ్య కాలంలో తమకు జరిగిన నష్టాన్ని ఏదో ఒక రూపంలో వసూళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా కంజ్యూమర్ కోర్టు వచ్చిన తర్వాత వినియోగదారులు ఏదైనా నష్టం వాటిల్లితే వెంటనే తమకు జరిగిన నష్టం తాలుకూ పరిస్థితి వెంటనే కంజ్యూమర్ కోర్టులో వేసి న్యాయం రాబట్టుతున్నారు. ఈ క్రమంలోనే రేల్వేలో ఏసీ 2 టైర్ టికెట్ కొన్న ప్రయాణికుడు రూ.440 నష్టాన్ని న్యాయబద్దంగా కోర్టు ద్వారా తనకు లబ్ది చేకూరేలా విజయం సాధించాడు. ఇంతకీ ఆ ప్రయాణికుడు ఎవరు.. ఎలా తనకు న్యాయం చేకూరేలా చేసుకున్నాడు అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివవరాల్లోకి వెళితే..

ఆగ్రాకు చెందిన మున్నాలాలక 2017 లో జండా జంక్షన్ నుంచి ఆగ్రా కంటోన్మెంట్ కి బయలుదేరేందుకు తత్కాల్ కోటా ద్వారా రూ.1570 టికెట్ కొనుగోలు చేశాడు. అయితే స్టేషన్ కి వెళ్లే సరికి టూ టైర్ ఏసీ కంపార్ట్ మెంట్ కనిపించకపోవడంతో షాక్ తిన్నాడు. కంగారులో బోగీని చూడకుండా ఫ్లాట్ ఫామ్ పైకి పలుమార్లు అటూ ఇటూ పరుగులు తీశాడు. మొత్తానికి కదులుతున్న రైలు లో ఏదో ఒక బోగీ అని ఎక్కేశాడు. అయితే టీసీకి తన పరిస్థితి గురించి విన్నవించుకున్నాడు. కానీ అతడు ఏమాత్రం వినిపించుకోలేదు.

చివరికి టీసీకి రూ.1130 చెల్లించి త్రీ టైం కంపార్ట్ మెంట్ సీటు తీసుకొని ప్రయాణించాడు. కానీ తన సీటు వద్ద వెళల్ిన మున్నాలాల్ కి వేరెవరో కనిపించడంతో ఆవేదన చెందాడు. ఈ క్రమంలోనే తనకు జరిగిన అన్యాయం పై ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తనకు తగిన నష్ట పరిహారాన్ని ఇవ్వాని కోర్టుకెక్కారు. అలాగే రైల్వేకు నోటీసులు పంపించాడు. 2018 లో సెప్టెంబర్ ఆగ్రా డిస్ట్రిక్ కన్జ్యూమర్ ఫోరమ్ ను ఆశ్రయించాడు. అలా తనకు న్యాయం జరిగే వరకు పోరాటం జరిపాడు మున్నాలాల్. ఈ క్రమంలోనే కోర్టు మున్నా లాల్ కి కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అతడికి రూ.440 తో పాటు దానిపై 7 శాతం వార్షిక వడ్డీని అదనంగా చెల్లించాలని నార్త్ సెంట్రల్ రైల్వే ను ఆదేశించింది. మొత్తానికి మున్నా లాల్ రూ.8000 లతో పాటు లీగల్ ఖర్చులు చేల్లించాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది.