Swetha
ఏదైనా సొంతంగా మనకు నచ్చిన బిజినెస్ చేయాలనీ ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే వారు కన్న కలలను సాకారం చేసుకుంటారు. కానీ మరికొంతమంది వారి ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల కోసం చిన్న బిజినెస్ చేసేవారు కూడా ఉంటారు.
ఏదైనా సొంతంగా మనకు నచ్చిన బిజినెస్ చేయాలనీ ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే వారు కన్న కలలను సాకారం చేసుకుంటారు. కానీ మరికొంతమంది వారి ఉద్యోగాన్ని వదిలేసి ప్రజల కోసం చిన్న బిజినెస్ చేసేవారు కూడా ఉంటారు.
Swetha
సొంతంగా బిజినెస్ చేయడం అనేది ఎంతో మంది కల. ఇప్పుడు ఎదో ఒక ఉద్యోగం చేస్తున్న వారందరికి కూడా ఎక్కడో ఒక దగ్గర ఎప్పటికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ప్లాన్ ఉండే ఉంటుంది. కానీ ఆరెంకల జీతాన్ని వదులుకుని.. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసే రిస్క్ మాత్రం చాలా కొంతమంది చేస్తారు. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి రిస్క్స్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారంతా ఎలా ఉన్నత స్థాయికి ఎదిగారు అనేది.. చాలా సక్సెస్ స్టోరీస్ లో చూస్తూనే ఉన్నాము. వారి జీవిత పాఠాలు ఎంతో మందికి మార్గదర్శకాలుగా మారిన వార్తలను కూడా ఇప్పటివరకు ఎన్నో చూశాము. ఇప్పుడు చెప్పుకోబోయే ఒక రియల్ లైఫ్ స్టోరీ కూడా అటువంటిదే. కానీ, ఇక్కడ ఒక చెఫ్ సొంతమగా డబ్బు సంపాదించాలని కాకుండా.. తన వంటలను సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించుకుని.. విలాసవంతమైన హోటల్ లో ఉద్యోగాన్ని వదిలిపెట్టి.. రోడ్ పక్కనే ఒక చిన్న దాబా పెట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకీ వెళ్తే..
సాధారణంగా స్టార్ హోటల్స్ లో వర్క్ చేసే చెఫ్స్ ఎవరైనా కానీ.. హోటల్ దాటి బయటకు వచ్చే ప్రయత్నాన్ని చేయరు. ఎందుకంటే, విలాసవంతమైన సౌకర్యాలు, మంచి జీతం.. ఇవన్నీ వదులుకునే సాహసం ఎవరు చేయరు. కానీ, మారియట్‌లో పని చేసే ఒక చెఫ్ మాత్రం తన వంట నైపుణ్యాన్ని.. సాధారణ ప్రజలందరికి తెలియాలని.. ఒక స్టార్ హోటల్ లో చెఫ్ ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఫ్యాన్సీ కిచెన్‌ల కు చెక్ పెట్టి రోడ్ సైడ్ ఓ చిన్న దాబా ను ఏర్పాటు చేశాడు. కానీ, ఎక్కడా కూడా అతను ఫుడ్ నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఫుడ్ వ్లాగర్స్ ఎక్కడెక్కడో ఉన్న మంచి మంచి రెస్టారెంట్స్ ను మన ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఇతని గురించి కూడా సోషల్ మీడియాలోకి వచ్చేసింది. అతను ఈ దాబాను ఏర్పాటు చేయడం వెనుక ఉన్న కారణాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.
ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు అని ఆ ఫుడ్ వ్లాగర్ అడిగినప్పుడు.. అతను “ఇక్కడ పనిచేయడం నాకు సంతోషాన్ని , తృప్తిని ఇస్తుంది. హోటల్ లో పనిచేసేటప్పుడు డబ్బు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు సొంతంగా దాబా ఏర్పాటు చేసుకుని కష్టపడుతున్నపుడు.. డబ్బు మాత్రమే కాదు ప్రజల ప్రేమ కూడా లభిస్తోంది.” అంటూ ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ చెఫ్ దాబా చండీగఢ్‌లో “రన్నింగ్ ధాబా ఆన్ స్ట్రీట్స్గా”గా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.