Arjun Suravaram
ఓ వ్యక్తి ఉదయాన్నే కారులో పట్టణంలోకి వెళ్తారు. ఎక్కడ గుంతలు కనిపిస్తే.. అక్కడ ఆయన వాలిపోతారు. వాటిని సొంత ఖర్చులతో పూడ్చి..రోడ్డు ప్రమాదాలను నివారిస్తున్నారు. మరి.. ఆయన గుంతలు పూడ్చే పని చేయడానికి ఓ బలమైన కారణం ఉంది.
ఓ వ్యక్తి ఉదయాన్నే కారులో పట్టణంలోకి వెళ్తారు. ఎక్కడ గుంతలు కనిపిస్తే.. అక్కడ ఆయన వాలిపోతారు. వాటిని సొంత ఖర్చులతో పూడ్చి..రోడ్డు ప్రమాదాలను నివారిస్తున్నారు. మరి.. ఆయన గుంతలు పూడ్చే పని చేయడానికి ఓ బలమైన కారణం ఉంది.
Arjun Suravaram
సాధారణంగా మనం వాహనంలో వెళ్తున్న, నడుచకుంటూ వెళ్తున్న రోడ్డుపై గుంత కనిపిస్తే ఏం చేస్తాము?. ఏముంది.. ఆ గుంత పక్క నుంచి తప్పుకుని వేరే మార్గంలో వెళ్తుంటాము. అయితే గుంతను పూడ్చాలని అనుకుంటామా?. చాలా తక్కువ మందికి మాత్రమే అలాంటి గొప్ప ఆలోచన వస్తుంది. అలానే ఓ వ్యక్తి కూడా కార్లు వెళ్తునే.. రోడ్డుపై ఎక్కడ గుంతలు, గతుకులు కనిపిస్తే చాలు..వాటిని పూడుస్తుంటాడు. ఇలా దాదాపు కొన్నేళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. అందుకు ఓ బలమైన కారణం ఉంది. తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని ఆయన ఈ పనికి పూనుకున్నాడు. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…
దేశ ఆర్ధిక రాజధాని ముంబై గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఎంతో మంది నివాసం ఉంటున్నారు. అలానే దాదారావు బిల్హోరే అనే వ్యక్తి కూడా తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. 51 ఏళ్ల ఈ వ్యక్తి కార్లో వెళ్తూ.. ఎక్కడ రోడ్డుపై గుంతలు కనిపించినా వాటిని పూడుస్తుంటారు. ఆయన కారు డిక్కీలో సిమెంట్, ఇసుక వంటివి ఉంటాయి. ఇక నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రయాణం చేస్తూనే ఉంటారు. అందికూడా ఇలాంటి గుంతలు ఎక్కడ ఉన్నాయా అని తెలుసుకుని మరీ.. వాటిని పూడ్చేస్తుంటారు. ఆయనకు కొందరు స్వచ్ఛందగా సాయం చేస్తుంటారు. అయితే ఆయన ఇలా చేయడానికి ఓ బలమైన కారణం ఉంది.
ఆయన 16 ఏళ్ల కొడుకు మరణం.. ఆయనను ఈ బృహత్తర కార్యం చేయడానికి పునాది వేసింది. 2015లో ఆయన కొడుకు రోడ్డు ప్రమాదాంలో మరణించాడు. 2015లో ఓ ప్రాంతంలో రోడ్డుపై ఉన్నగుంత కారణంగా దాదారావు కుమారుడు ప్రకాశ్ మరణించాడు. స్నేహితుడి బర్త్ డే ఉందని బయటకు వెళ్లాడు. కాసేపటికే దాదారావు తన కుమారుడి మరణవార్త విని గుండె పగిలేలా విలపించారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తన కుమారుడు మరణించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనువిప్పు కలిగేలా.. తనలాగా మరే తండ్రికి పుత్రశోకం రాకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఇలా రోడ్లపై ఉండే గతుకులను పూడ్చి బాగు చేస్తున్నాడు అంటే.. ఆయన ఏదో పెద్ద ధనవంతుడు అనుకుంటే పొరపాటే. ఆయన ఓ సాధారణ మధ్యతరగతి వ్యక్తే. ఆయన స్థానికంగా కూరగాయాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో రోడ్డుపై ఉండే గుంతలను, గతుకులను బిల్హోంరే పూరించేశారు. అలా గుంతలు పూడ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అయితే కేవలం తనవంతుగా సాయం చేస్తూనే.. అధికారులను మేల్కోపేలా చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడినందుకు సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలా తనవంతుగా ప్రమాదాలా నివారణకు కృషి చేస్తున్నారు దాదారావు.