ఆస్పత్రిలో దారుణం.. పేషెంట్లకు ఇచ్చిన ఆహారంలో కనిపించిన బల్లి!

బిర్యానీలో ఎలుకలు, బొద్దింకలు వచ్చిన ఘటనలు గతంలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే, తాజాగా మాత్రం ఏకంగా ఆస్పత్రిలోని రోగులకు ఇచ్చిన ఆహారంలో బల్లి కనిపించింది. ఇది చూసిన పేషెంట్లు ఒక్కసారిగా ఖంగుతున్నారు. దీనిని గమనించిన కొందరు రోగుల కుటుంభికులు ఆస్పత్రి అధికారులను నిలదీశారు. ఇదే ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

అది ఉత్తర్ ప్రదేశ్ అంబేద్కర్ నగర్ లోని అల్లోపతిక్ మెడికల్ కాలేజ్. ఇదే ఆస్పత్రికి ఎంతోమంది రోగులు వెళ్తుంటారు. అయితే, ఇందులోని పేషెంట్స్ కు ఉచిత ఆహారాన్ని అందిస్తుంటారు. కానీ, తాజాగా రోగులకు పంచిన ఆహారంలో బల్లి కనిపించింది. దీనిని చూసి రోగులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే ఆస్పత్రిలోని అధికారులను ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఆహారంలో ఉన్న బల్లిని కొందరు సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. రోగాలను నయం చేస్తారని ఆస్పత్రికి వస్తే.. కలుషితమైన ఆహారం పెట్టి రోగులను చంపేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? కొంచం దృష్టిపెడితే పాన్ ఇండియా స్టార్ అనిపిస్తుంది!

Show comments