iDreamPost
android-app
ios-app

భార్యకు గుడి కట్టి నిత్య పూజలు చేస్తున్న భర్త

  • Published Aug 07, 2023 | 9:50 PM Updated Updated Aug 07, 2023 | 9:50 PM
  • Published Aug 07, 2023 | 9:50 PMUpdated Aug 07, 2023 | 9:50 PM
భార్యకు గుడి కట్టి నిత్య పూజలు చేస్తున్న భర్త

భార్యాభర్తలు రాత్రిళ్లు గొడవ పడినా తెల్లారేసరికి మళ్లీ తిరిగి మాట్లాడుకుని ప్రేమగా ఉంటారు. బయటకు పోట్లాడుకున్నట్లు కనిపించినా.. లోపల మాత్రం ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. ఇదే సమయంలో ఇద్దరిలో ఎవరు మరణించినా.. వాళ్లు అస్సలు తట్టుకోలేరు. ఇలాగే ఓ వ్యక్తి భార్య గతంలో మరణించింది. ఇక భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త.. భార్యకు ఏకంగా గుడి కట్టి నిత్య పూజలు చేస్తున్నాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ ఫతేపుర్ జిల్లాలోని బకేవర్ పరిధిలోని పధారా గ్రామంలో రామ్ సేవక్-స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు ఎంతో ప్రేమగా కలిసుండేవారు. ఇదిలా ఉంటే.. గతంలో కరోనాతో స్వరూప మరణించింది. భార్య మరణాన్ని భర్త రామ్ సేవక్ జీర్ణించుకోలేకపోయాడు. అలా కొంత కాలం తర్వాత అతడికి భార్యపై ఉన్న ప్రేమతో ఆమె పేరు మీద ఓ గుడి నిర్మించాడు.

ఇంతే కాకుండా ఆమెకు రోజూ నిత్య పూజలు చేస్తూ తన ప్రేమను చాటుకుంటున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు అంతా అక్కడికి చేరుకుని ఆ గుడిని సందర్శిస్తున్నారు. ఈ అంశంపై భర్త రామ్ సేవక్ స్పందిస్తూ.. ఈ గుడిలో ఉంటే నాకు నా భార్యతో ఉన్నట్లే అనిపిస్తుంటుందని, అందుకే రోజూ సాయంత్రం పూట పూజలు చేస్తానని తెలిపారు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి: అమెజాన్ లో క్రేజీ ఆఫర్.. 40,999 స్మార్ట్ టీవీ 13,499కే!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet