హృదయవిదారక ఘటన.. భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

దేశంలో ఎక్కడో అక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం బయట పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పేద ప్రజలకు అంబులెన్స్ అందుబాటులో లేక ప్రైవేట్ వాహనాల్లో తరలించలేక మృతదేహాలను తమ భుజాలపై మోసుకువెళ్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

దేశంలో ఎక్కడో అక్కడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం బయట పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పేద ప్రజలకు అంబులెన్స్ అందుబాటులో లేక ప్రైవేట్ వాహనాల్లో తరలించలేక మృతదేహాలను తమ భుజాలపై మోసుకువెళ్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

దేశంలో  ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా తయారు చేశామని చెబుతున్నాాయి రాష్ట్ర ప్రభుత్వాలు. వైద్య రంగానికి విపరీతమైన ఖర్చులు చేస్తున్నామని చెబుతున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ ఆస్పత్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో చాలా మంది పేద ప్రజలు తలకు మించిన భారమైనా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నారు. దారుణం ఏంటంటే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అంబులెన్స్, వీల్ చైర్స్, స్ట్రెచర్స్ సమయానికి ఉండవు. బాధితులు అంబులెన్స్ కావాలంటే డబ్బు చెల్లించాల్సిందే.. లేదంట నిర్దాక్షిణ్యంగా నెట్టేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా ఓడిశా రాష్ట్రంలో ఒక హృదయవిదారకమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

దేశంలో కొన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సమయానికి అంబులెన్స్ అందుబాటులో ఉండక.. ఒకవెళ ఉన్నా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడంతో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఒడిశాలో మరో హృదయవిదారకమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ అందుబాటులో లేక భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్ల వరకు మోసుకెళ్లాడు భర్త.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బందికి నెల నెల జీతాలు చెల్లిస్తుంటారు. పేద ప్రజల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులపై మండిపడుతున్నారు.

ఈ సంఘటన గురించి మృతురాలి భర్త అభి అమానత్య మాట్లాడుతూ.. నా భార్య కరుణ (28) మూడు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి కోరాపూట్ జిల్లా పురుణగూడలోని తన పుట్టింటో ఉంటుంది.  గత కొన్నిరోజులుగా అరుణకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కన్నుమూసింది. అంత్యక్రియలు తన ఇంటి వద్ద నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్ జిల్లా నందహండి సమితి ఫుపుగావ్ కు తీసుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాం. అయితే మృతదేహాన్ని తరలించేందుకు అబులెన్స్, మహప్రాణ వాహనాలకు ఎన్నిసార్లు ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో మృతదేహాన్ని ఎక్కువ సేపు ఉంచేందుకు ఇష్టం లేక 20 కిలోమీటర్ల వరకు మోసుకొని వెళ్లాం. మేం అతి పేదవాళ్లం.. ప్రైవేట్ వాహనాల్లో తరలించేందుక డబ్బులు లేవు. అందురే నా భార్య మృతదేహాన్ని మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments