iDreamPost
android-app
ios-app

Rare disease: చిన్నారికి అరుదైన వ్యాధి.. 15 నెలల బాలుడికి 17 కోట్ల ఇంజెక్షన్!

  • Published Dec 18, 2023 | 8:40 PM Updated Updated Dec 18, 2023 | 8:40 PM

ఓ చిన్నారికి వచ్చిన అరుదైన వ్యాధిపై పోరాడేందుకు ప్రపంచం మెుత్తం ఏకమైంది. ఆ బాలుడి ఇంజెక్షన్ కు రూ. 17 కోట్లు అవసరం అయ్యాయి.

ఓ చిన్నారికి వచ్చిన అరుదైన వ్యాధిపై పోరాడేందుకు ప్రపంచం మెుత్తం ఏకమైంది. ఆ బాలుడి ఇంజెక్షన్ కు రూ. 17 కోట్లు అవసరం అయ్యాయి.

Rare disease: చిన్నారికి అరుదైన వ్యాధి.. 15 నెలల బాలుడికి 17 కోట్ల ఇంజెక్షన్!

ఓ చిన్నారికి వచ్చిన అరుదైన వ్యాధిపై పోరాడేందుకు ప్రపంచం మెుత్తం ఏకమైంది. ఆ బాలుడిని కాపాడేందుకు పెద్ద ఎత్తున విరాళాలు సేకరించడం మెుదలుపెట్టారు. ‘సేవ్ భూదేవ్’ పేరుతో ఆన్ లైన్ లో ప్రచారం స్టార్ట్ చేశారు. ఈ ఉద్యమానికి భారీగా దాతలు ముందుకువచ్చారు. వారితోపాటుగా కేంద్ర ప్రభుత్వం, ఓ ఔషద సంస్థ అండగా నిలవడంతో.. ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఆ బాలుడి పేరు భూదేవ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహారన్ పూర్ లో వీరి కుటుంబం నివాసం ఉంటుందో. భూదేవ్ తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో.. బాలుడి ప్రాణాలకు ముప్పువాటిల్లింది. ఈ నేపథ్యంలో దాతలు ఆన్ లైన్ ప్రచారం చేపట్టారు. ఈ బాలుడికి రూ. 17 కోట్ల ఇంజెక్షన్ అవసరం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ కు చెందిన భూదేవ్ అనే 15 నెలల బాలుడికి ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫి-టైప్1’ అనే అనే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి నయం కావడానికి రూ. 17 కోట్ల ఇంజెక్షన్ అవసరమైంది. కానీ బాలుడి తల్లిదండ్రులు నిరుపేదలు. దీంతో తమ కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని ఆన్ లైన్ లో ‘సేవ్ భూదేవ్’ పేరుతో విరాళాలు సేకరించారు. ఇక ప్రచారం వల్ల పెద్ద మెుత్తంలో డబ్బులు వచ్చాయి. అదీకాక ప్రముఖ ఔషద సంస్థ నోవార్టిస్ సాయం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా తనవంతు సాయంగా ఈ ఇంజెక్షన్ పై దిగుమతి సుంకం మినహాయించింది. ఈ కారణంగా 17 కోట్ల ఇంజెక్షన్ ధర రూ. 10 కోట్లకు దిగొచ్చింది. కాగా.. దిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆ ఔషధాన్ని బాలుడికి ఇచ్చారు. ప్రస్తుతం భూదేవ్ వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నాడు. చిన్నారికి వచ్చిన సమస్యపై ఇంత భారీ ఎత్తున స్పందించడం ఐకమత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరి ఓ చిన్నారి ప్రాణాలు ఈ విధంగా కాపాడటం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.