అప్పుడు జ్యోతి మౌర్య.. ఇప్పుడు ప్రీతి కుమారి.. జాబ్ రాగానే..

ఇంటికి దీపం ఇల్లాలు. ఆ ఇల్లాలిని చదివిస్తే.. కుటుంబంలో మరింత వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాడు భర్త. కానీ ఆమె మాత్రం తన జీవితంలో మాత్రమే వెలుగులు నింపుకుని, భర్తను జీవితాన్ని చీకటిమయం చేస్తుంది.

ఇంటికి దీపం ఇల్లాలు. ఆ ఇల్లాలిని చదివిస్తే.. కుటుంబంలో మరింత వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నాడు భర్త. కానీ ఆమె మాత్రం తన జీవితంలో మాత్రమే వెలుగులు నింపుకుని, భర్తను జీవితాన్ని చీకటిమయం చేస్తుంది.

భార్య అంటే కేవలం వంటింటి కుందేలు కాదు.. ఆమె కంటూ కొన్ని కలలు, కోరికలు ఉంటాయని గ్రహించిన భర్త.. పెళ్లయ్యాక కూడా జీవిత భాగస్వామిని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. భార్య లక్ష్యాలు నేరవేర్చేందుకు ఎంతో కృషి చేస్తున్నాడు. కానీ చదువుకోక ముందు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నట్లుగా మారిపోతుంది భార్య తీరు. ఒడ్డుకు చేరాక తెప్ప తెగలేసినట్లుగా..లక్ష్యం చేరుకోగానే, భర్త కష్టాన్ని గ్రహించకుండా.. తన సుఖం కోసం కట్టుకున్న వాడికి వెన్నుపోటు పొడుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని జ్యోతి మౌర్యది ఇదే తీరు. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలన్న తన కలను భర్త తీర్చేందుకు కోచింగ్ సెంటర్‌లో చేర్పించి.. శిక్షణనిప్పిస్తే.. ఉద్యోగం వచ్చాక.. కట్టుకున్నవాడ్ని వదిలేసి.. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన ఎంతటి సంచలనం కలిగించిందో తెలుసు. ఇప్పుడు ఇటువంటి ఘటనే మరోటి వెలుగు చూసింది. ఈసారి యూపీలో కాదు బీహార్‌లో.

భార్యను కష్టపడి చదివించి పోలీస్ కానిస్టేబుల్‌ను చేస్తే.. ఆమె మాత్రం అతడికి నమ్మకద్రోహాన్ని గిఫ్టుగా ఇచ్చింది. బీహార్‌లోని గయాకు చెందిన ప్రీతి కుమారి కథ ఇప్పుడు చర్చనీయాంశమైంది. గయాలోని షేర్‌ఘటి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శ్రీరాంపూర్‌ పంచాయతీలోని భుజౌల్‌ గ్రామానికి చెందిన మిథిలేష్‌కు జార్ఖండ్‌లోని హంటర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రీతికి 2017లో పెళ్లైంది. వీరికి పాప కూడా ఉంది. మిథిలేష్ కూలీ చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అయితే భార్యకు పోలీస్ జాబ్ కొట్టాలని కోరిక. ఈ విషయాన్ని భర్తకు చెప్పగా.. ఆమె కోరిక తీర్చేందుకు కోచింగ్ ఇప్పించాడు. అనుకున్నట్లుగానే ఆమె పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టింది. భార్య తన నమ్మకాన్ని వమ్ము చేయలేదని సంబరపడిపోయాడు భర్త. కానీ ఆ ఆనందం ఎంత కాలం నిలవలేదు. ఉద్యోగం వచ్చాక ప్రీతి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఉద్యోగ రీత్యా దూరంగా ఉంటున్న భార్యకు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా ఎత్తడం లేదు. తనను కలవట్లేదు.

దీంతో విసుగు చెందిన మిథిలేష్.. గయా ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశాడు. తన భార్యను తిరిగి తన వద్దకు పంపాలంటూ కోరాడు. ‘నేను చాలా కష్టపడి చదివించాను, ఉద్యోగం కోసం చాలా చేశాను. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను వదిలేసింది. నా దగ్గరకు రావట్లేదు. ఫోన్లు చేసినా స్పందించడం లేదు. దయచేసి నా భార్యను నా దగ్గరకు పంపండి’ అంటూ పేర్కొన్నాడు. ఇదే సమయంలో ఈ స్టోరీలో ఓ ట్విస్ట్ రివీల్ అయ్యింది. ప్రీతికి మిథిలేష్ సెకండ్ భర్త అని. 2012లో ఆమెకు వివాహం కాగా, విడాకులు ఇచ్చిందని. ఆ తర్వాత మిథిలేష్ ఆమె జీవితంలోకి ఎంటర్ అయ్యాడు. 2017లో ఈ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కానిస్టేబుల్ చేసేందుకు కష్టపడ్డాడు. ఇదిలా ఉంటే.. ప్రీతి వాదన మరోలా ఉంది. భర్త తనను హింసించేవాడని, నా ఏటీఎం కార్డు లాక్కొని, డబ్బులు డ్రా చేసి జల్సాలు చేసేవాడని, వరకట్నం కోసం వేధించాడని, ఇక అతడితో కలిసి జీవించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎటు తేల్చాలో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు. తమ లక్ష్యాలు నెరవేర్చుకున్నాక.. భర్తలకు భార్యలు హ్యాండ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

Show comments