బాలుడు సమయస్ఫూర్తితో తప్పిన రైలు ప్రమాదం!

Boy Wit Avert Major Train Mishap: ఈ మధ్య కాలంలో దేశంలోవరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది ఆకతాయిలు, విద్రోహ శక్తులు రైలు పట్టాలు ధ్వంసం చేయడం, రాళ్లు వేయడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వందే భారత్ ఎక్స్ పై ఇప్పటికీ రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి.

Boy Wit Avert Major Train Mishap: ఈ మధ్య కాలంలో దేశంలోవరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొంతమంది ఆకతాయిలు, విద్రోహ శక్తులు రైలు పట్టాలు ధ్వంసం చేయడం, రాళ్లు వేయడం లాంటివి చేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. వందే భారత్ ఎక్స్ పై ఇప్పటికీ రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సాంకేతిక లోపాలు కొన్నైతే మానవ తప్పిదాల వల్ల మరికొన్ని జరుగుతున్నాయి. కొంతమంది ఆకతాయిలు రైలు పట్టాలపై రాళ్లు ఇతర వస్తువులు వేయడం.. సంఘ విద్రోహ శక్తులు రైలు పట్టాలు తొలగించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు రైల్వే సిబ్బంది అలర్ట్ గా ఉంటారు. కానీ కొన్నిసార్లు చిన్న ఏమరపాటు ప్రమాదాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. రైల్వే పట్టాలు విరిగి ఉండటం చూసిన ఓ బాలుడు వెంటనే అలర్ట్ అయి చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.   వివరాల్లోకి వెళితే..

బీహార్‌లో ఓ 12 ఏళ్ల బాలుడు చేసిన సాహసం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. రైల్వే ప్రమాదం నుంచి వందల మంది ప్రాణాలు రక్షించిన ఆ బాలుడికి జేజేలు పలుకుతున్నారు.  బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాలోని భోలా టాకీస్ గుప్తీ ప్రాంతానికి చెందిన  12 ఏళ్ల మొహమ్మద్ షాబాజ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ముజఫర్ పూర్ రైల్వే ట్రాక్ మీదుగా నడుస్తూ వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ చోట రైల్ పట్టాలు విరిగి ఉండటం గమనించాడు.  అది చూసి ముజఫర్ స్నేహితులు భయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. పట్టా విరగడం వల్ల అటుగా వచ్చే ట్రైన్ ప్రమాదానికి గురైతుందని ఊహించాడు ముజఫర్.  ముజఫర్ మాత్రం ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించాడు.. తన వద్ద ఉన్న ఎర్ర టవల్ తీసుకొని ట్రాక్ పై నుంచి వస్తున్న హౌరా–కథ్ గోడమ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కి ఎదురుగా వెళ్లాడు.

బాలుడు ఎర్ర టవల్ తో రావడం గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ వేశాడు. దీంతో ట్రైన్ ఒక్కసారిగా ఆగిపోయింది. రైల్వే సిబ్బంది కిందకి దిగి చూడగా రైలు పట్టా విరిగి ఉండటం గుర్తించారు. వెంటనే ట్రాక్ మరమ్మతులు పూర్తి చేసి రైలును పంపించారు. ముజఫర్ చేసిన సాహసం చూసి అధికారులు, ప్రయాణికులు అభినందించారు. షాబాజ్ చేసిన పనికి ప్రధానమంత్రి బాల పురస్కారం ప్రధానం చేయాలని కోరుతున్నారు. మరోవైపు బాలుడి ప్రదర్శించిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తి మెచ్చుకుంటూ నేతలు చిరు సత్కారం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Show comments