Keerthi
ఓ పేదింటి ఓ యువకుడు తన తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేందుకు పట్టు విడువని విక్రమార్కుడిలా కష్టపడ్డాడు. మొత్తానికి తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. తన డ్రీమ్ జాబ్ అయిన గూగుల్ లో ఉద్యోగం సంపాదించాడు. మరి, ఆ యువకుడి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ పేదింటి ఓ యువకుడు తన తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేందుకు పట్టు విడువని విక్రమార్కుడిలా కష్టపడ్డాడు. మొత్తానికి తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. తన డ్రీమ్ జాబ్ అయిన గూగుల్ లో ఉద్యోగం సంపాదించాడు. మరి, ఆ యువకుడి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Keerthi
ఐటీ హబ్ లో ఉద్యోగం చేయలని ప్రతిఒక్కరూ కలలు కంటారు. అందుకే ఎంత కష్టమైన సరే చాలామంది.. ఇష్టంతో ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వలని కలలు కంటారు. అది కూడా గూగుల్ లాంటి టాప్ కంపెనీల్లో ఉద్యోగం సాధించాలనేది ప్రతిఒక్క సాఫ్ట్‌వేర్ డ్రీమ్. కానీ, ఈరోజుల్లో ఐటీ ఉద్యోగాల్లో జాబ్ సంపాదించాలంటే చాలా కష్టంగా మారింది. అసలే ఓ వైపు ఐటీ సంస్థల్లో ఉద్యోగుల కోతలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో డ్రీమ్ జాబ్, అది కూడా గూగుల్ కంపెనీలో అంటే డ్రీమ్ గానే మిగిలిపోతుందని చెప్పవచ్చు. కానీ, తన ఆశయం, పడిన కష్టం డ్రీమ్ గా ఉండిపోకుడాదని గూగుల్ లో ఉద్యోగం సంపాదించి చూపించాడు ఓ యువకుడు. దీంతో అతని కుటుంబం మొత్తం సంతోషంలో మునిగి తేలుతోంది. మరి, ఆ యువకుడి విజయగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓ యువకుడు తన తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేందుకు పట్టు విడువని విక్రమార్కుడిలా కష్టపడ్డాడు. మొత్తానికి తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. తన డ్రీమ్ జాబ్ అయిన గూగుల్ లో రూ.2.07 కోట్లతో ఉద్యోగం సాధించి తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. జాముయి జిల్లాలోని జము ఖరియా గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్ పట్నా ఎన్‌ఐటీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత పెద్ద కంపెనీలో ఆకర్షణీయమైన జీతంతో ఉద్యోగం సాధించాడు. కానీ, అక్కడితో అభిషేక్ ఆగిపోలేదు. తాను కన్న కలల కోసం మరీంత శ్రమించాడు. ఈ క్రమంలోనే 2022లో అమెజాన్‌లో రూ. 1.08 కోట్ల ప్యాకేజీతో సాధించాడు. ఇలా అక్కడ నుంచి 2023 మార్చి వరకు పనిచేశాడు. ఆ తర్వాత, జర్మన్ పెట్టుబడి సంస్థ విదేశీ మారకపు ట్రేడింగ్ యూనిట్‌లో చేరాడు.
అయినా సరిపోయిందిలే ఇంకేమి కష్టపడతం.. ఉన్న దాంట్లో సరిపెట్టుకుందాం అని ధీమా వ‍్యక్తం చేయలేదు. మళ్లీ రెట్టింపు కృషి చేసి కష్టపడ్డాడు. ఈ నేపథ్యంలోనే.. అభిషేక్ పడినా కష్టామో.. ఆ దేవుడి అనుగ్రహమే, తల్లిదండ్రుల అదృష్టమో తెలియదు కానీ.. నిజంగా అతని కల నేరవేరింద. అనుకున్న విధంగానే అభిషేక్ కు గూగుల్‌లో ఏడాదికి రూ. 2.07కోట్ల జీతంతో ఉద్యోగాన్ని వచ్చింది. అంతేకాకుండా.. గూగుల్ లండన్ కార్యాలయంలో అక్టోబర్‌లో ఆయన విధుల్లో చేరనున్నాడు. ఇక కొడుకు సాధించిన ఘనత చూసి అభిషేక్ తల్లిదండ్రులు చాలా భావోద్వేగానికి గురైయ్యారు.
ఇదిలా ఉంటే.. అభిషేక్ విజయగాథ ఆయన మాటాల్లో చెప్పాలంటే.. ఒక కంపెనీలో అతను 8 నుంచి 9 గంటలు పని చేస్తూ, మిగిలిన సమయాన్ని తన కోడింగ్ నైపుణ్యాలను పెంచుకుంటూ , గూగుల్‌లో ఇంటర్వ్యూల కోసం సిద్ధమయ్యేవాడు. నిజానికి ఇది చాలా సవాలుతో కూడుకున్న పని. ఒక రకంగా అభిషేక్ పట్టుదల ఆయన చేసిన కృషి ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా అభిషేక్ మాట్లాడుతూ.. నేను ఒక చిన్న పట్టణం నుండి వచ్చాను. మా గ్రామంలో మట్టితో చేసిన ఇంట్లోనే మేము ఉండేవాళ్లాం. కానీ, ఇప్పుడు నేను కొత్త ఇల్లు నిర్మిస్తున్నాను అని సంతోషంగా చెప్పాడు.
అలాగే చిన్న పట్టణమైనా, పెద్ద నగరమైనా, ఏ పిల్లలైనా సరే, అంకితభావం ఉంటే, గొప్ప అవకాశాలను అందుకోగలరని నేను దృఢంగా నమ్ముతాను. ఏదైనా సాధించగలమని అని తన తోటివారికి మంచి సందేశం కూడా ఇచ్చాడు. ఇకపోతే అభిషేక్ తల్లి చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారట. దీంతో అప్పటి నుంచి ఆమెకు మెరుగైనా ఆరోగ్యం అందించాలనే కోరికతో కష్టపడి చదివి, మంచి ఉద్యోగం సంపాదించలనే ప్రేరణ నన్ను ఈ గమ్యం వైపు నడిపింది. ఇప్పుడు నేను ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను.
ఈ సందర్భంగా తనను ప్రోత్సహించిన కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. తండ్రి ఇంద్రదేవ్ యాదవ్ జముయి సివిల్ కోర్టులో న్యాయవాది, తల్లి మంజు దేవి గృహిణి. ఇక ముగ్గురి సంతానంలో అభిషేక్ చిన్నవాడు కావడం గమనర్హం. మరీ, డ్రీమ్ జాబ్ అయిన గూగుల్ ఉద్యోగం సాధించిన అభిషేక్ విజయగాథపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.