టూవీలర్ అంటే భయపడుతున్న ఆడపిల్లలూ.. ఈ బామ్మని చూసి ధైర్యం తెచ్చుకోండి!

Super Woman: టూవీలర్ నడపాలంటే చాలా మంది అమ్మాయిలు భయపడతారు. కానీ ఈ బామ్మ తెగువని చూస్తే మీకు కావాల్సినంత ధైర్యం వస్తుంది. ఆమె 71 ఏళ్ల వయసులో పెద్ద పెద్ద వాహనాలను అవలీలగా నడిపేస్తున్నారు.

Super Woman: టూవీలర్ నడపాలంటే చాలా మంది అమ్మాయిలు భయపడతారు. కానీ ఈ బామ్మ తెగువని చూస్తే మీకు కావాల్సినంత ధైర్యం వస్తుంది. ఆమె 71 ఏళ్ల వయసులో పెద్ద పెద్ద వాహనాలను అవలీలగా నడిపేస్తున్నారు.

71 ఏళ్ళు వచ్చాయంటే ఎవరైనా ఏం చేస్తారు. ఇంట్లో కూర్చుని పెన్షన్ కోసం ఎదురుచూస్తుంటారు. మనవళ్లతో కాలక్షేపం చేస్తుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం 71 ఏళ్ల వయసులో కూడా భారీ వాహనాలను అవలీలగా నడిపేస్తున్నారు. జేసీబీలు, క్రేన్లు వంటి హెవీ వాహనాలను కూడా ఆమె ఈజీగా నడుపుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు ఆమె దగ్గర భారీ వాహనాలకు సంబంధించి 11 లైసెన్సులు ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు స్కూటీ నడపడానికే భయపడిపోతారు. కానీ ఈ బామ్మ మాత్రం 71 ఏళ్ల వయసులో ఎలాంటి భయం, బెరుకు లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా నడిపేస్తున్నారు. ఆమె పేరు రాధమణి. కేరళకు చెందిన ఈమె 1981లో తొలిసారిగా ఫోర్ వీలర్ లైసెన్స్ పొందారు. ఆ తర్వాత 1984లో హెవీ వెహికల్ లైసెన్స్ పొందారు.

అంతేకాదు ఆమె హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ ని కూడా స్థాపించారు. 2004లో భర్త చనిపోయారు. దీంతో ఆమె ఈ ఫీల్డ్ లో అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వాటన్నిటినీ ఎదుర్కొని పట్టుదలతో డ్రైవింగ్ స్కూల్ బాధ్యతలను చేపట్టి డ్రైవింగ్ కమ్యూనిటీ లీడర్ స్థాయికి ఎదిగారు. మొదట్లో ఏ2జడ్ డ్రైవింగ్ స్కూల్ గా ఉన్న డ్రైవింగ్ స్కూల్.. ఆ తర్వాత ఏ2జడ్ ఇన్స్టిట్యూట్ గా మారిపోయింది. ఈమె అన్ని రకాల భారీ వాహనాలను ఎలా నడపాలో, జేసీబీ, క్రేన్ లాంటి వాటిని ఎలా ఆపరేట్ చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. విచిత్రం ఏంటంటే.. ఈమె ఈ వయసులో కూడా చదువుని కొనసాగిస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేస్తున్నారు.

మొదట్లో హెవీ వాహనాల డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు భయం వేసేదని.. సవాలుగా ఉండేదని ఆమె అన్నారు. ఈ క్రమంలో చిన్న వాహనాల కంటే కూడా హెవీ వెహికల్స్ నడపడమే చాలా ఈజీ అని ఆమె అన్నారు. ఇప్పటివరకూ ఆమె 11 హెవీ వాహనాల లైసెన్సులు పొందినట్లు చెప్పుకొచ్చారు. నేర్చుకోవాలన్న తపన ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని.. దానికి వయసుతో సంబంధం ఉండదని ఆమె అన్నారు. డ్రైవింగ్ అనేది ఏ ఒక్క లింగానికో పరిమితం కాదని చెబుతున్నారు. నిజంగా ఈ బామ్మ చాలా గ్రేట్. ఈ వయసులో ఆమె డ్రైవింగ్ చేయడమే గాక ఇతరులకు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఆడపిల్లలకి ధైర్యం చెబుతున్నారు.

Show comments