iDreamPost
android-app
ios-app

హోమ్ లోన్స్‌పై 5 లక్షలకు పన్ను రాయితీ పెంపు? జూలై బడ్జెట్‌లో ప్రకటన!

  • Published Jun 30, 2024 | 6:17 PM Updated Updated Jun 30, 2024 | 6:17 PM

Budget 2024: హోమ్ లోన్స్ మీద కట్టే వడ్డీల మీద 2 లక్షల వరకూ పన్ను రాయితీ అనేది ఉంది. అయితే ఇప్పుడు దీన్ని 5 లక్షలకు పెంచాలని డిమాండ్లు చేస్తున్నారు. బడ్జెట్ లో కేంద్రం ఈ డిమాండ్ కి అంగీకరిస్తే కనుక హోమ్ లోన్ తీసుకునేవారికి భారీ ప్రయోజనాలు చేకూరుతాయి.

Budget 2024: హోమ్ లోన్స్ మీద కట్టే వడ్డీల మీద 2 లక్షల వరకూ పన్ను రాయితీ అనేది ఉంది. అయితే ఇప్పుడు దీన్ని 5 లక్షలకు పెంచాలని డిమాండ్లు చేస్తున్నారు. బడ్జెట్ లో కేంద్రం ఈ డిమాండ్ కి అంగీకరిస్తే కనుక హోమ్ లోన్ తీసుకునేవారికి భారీ ప్రయోజనాలు చేకూరుతాయి.

హోమ్ లోన్స్‌పై 5 లక్షలకు పన్ను రాయితీ పెంపు? జూలై బడ్జెట్‌లో ప్రకటన!

జూలై నెలలో పార్లమెంట్ లో కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగం కేంద్రం నుంచి పలు ప్రోత్సాహకాలను ఆశిస్తుంది. 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ లో పలు ప్రోత్సాహకాలను అందించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిలో పూర్తి స్థాయి పరిశ్రమ హోదా కల్పించడం, హోమ్ లోన్ వడ్డీపై రాయితీని 5 లక్షలకు పెంచడం వంటివి ప్రధానంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి స్థాయి పరిశ్రమ హోదా దక్కితే కనుక ఆ రంగానికి అవసరమైన ట్యాక్స్ బెనిఫిట్స్ లభిస్తాయని రియల్ ఎస్టేట్ వర్గాల వారు అంటున్నారు. దీంతో పాటు చట్టపరమైన ప్రయోజనాలు, పన్ను ప్రోత్సాహకాలు, లోన్ మంజూరు వంటివి ఉంటాయని చెబుతున్నారు.

ఇటీవలే కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 3 కోట్ల ఇళ్లను ప్రకటించింది. అయితే నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతుండడంతో ఆవాస్ యోజన పథకాన్ని మిగతా వర్గాలకు కూడా వర్తించేలా చేయాలని కోరారు. మరోవైపు హోమ్ లోన్స్ పై పన్ను రాయితీని పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. పన్ను మినహాయింపులతో ఇళ్ళు కొనేవారితో పాటు పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. గృహ రుణాల వడ్డీ చెల్లింపులపై ప్రస్తుతం 2 లక్షలుగా ఉన్న పన్ను రాయితీని.. 5 లక్షలకు పెంచాలని కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా మోదీ సర్కార్ ప్రవేశపెట్టే తొలిబడ్జెట్ లో పన్ను రాయితీ లిమిట్ ని పెంచుతారని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

అంతేకాకుండా ఆదాయపు పన్ను శ్లాబుల్లో కూడా మార్పులు చేస్తారన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ మార్పులు జరిగితే కనుక రియల్ ఎస్టేట్, దాని అనుబంధ రంగాల్లో ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ వల్ల 200 అనుబంధ రంగాలకు లబ్ది చేకూరుతుందని.. మన దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు రియల్ ఎస్టేట్ రంగం దోహదం చేస్తుందని అంటున్నారు. 2024-25 బడ్జెట్ లో హోమ్ లోన్స్ కి పన్ను రాయితీ పరిమితిని పెంచితే ఇళ్ల యూనిట్లకు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ పరిశ్రమకు పరిశ్రమ హోదా మంజూరు అయితే నిధుల లభ్యత సులభతరం అవుతుందని అంటున్నారు. మరి వీరు కోరుకుంటున్నట్లు జూలై బడ్జెట్ లో ఎలాంటి ప్రకటనలు వెలువడతాయి చూడాలి.