ఒడిశా రైలు ప్రమాదం: నెల గడిచినా.. పూర్తి కాని మృతదేహాల గుర్తింపు

దేశ చరిత్రలో అతి ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా నిలిచి, ఎన్నో కుటుంబాల్లో వెలుగులు చిదిమేసిన ఘటనకు సంబంధించిన విషాదఛాయలు ఇంకా వీడలేదు. ఒడిశా రైలు ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా 42 మృతదేహాలు అనాథ శవాల్లా మార్చురీలో పడి ఉన్నాయి. జూన్‌ 2న బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నెల రోజులు గడిచిపోయింది. అయినా, మృతదేహాల గుర్తింపు మాత్రం ఇంకా పూర్తికాలేదు.

ప్రమాదం జరిగిన తర్వాత శవాల దిబ్బలు కనిపించాయి. వాటిని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు చేర్చిన ఒడిశా ప్రభుత్వం.. వీలైనంత వేగంగా వాటిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయినా కూడా ఇంకా 42 మృతదేహాల వివరాలు తెలియడం లేదు. గుర్తు తెలియని 81 మృతదేహాలకు ఇటీవలే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అందులో 39 మంది మృతదేహాలను గుర్తించి వాటిని దహన సంస్కారాల నిమిత్తం వారి కుటుంబాలకు అప్పగించారు. ప్రస్తుతం 42 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. అయితే తమవాళ్ల ఆచూకీ ఇంకా లభించలేదన ఎవరూ ముందుకు కూడా రావడం లేదు. దీంతో ప్రస్తుతం వాటిని భువనేశ్వర్ ఎయిమ్స్ మార్చురీలో భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు.

Show comments