Arjun Suravaram
Maldives: ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ప్రభావం మాల్దీవులకు గట్టి దెబ్బలు తలుగుతున్నాయి. రోజూకు 400 విమానాల టికెట్లు రద్దు అవుతున్నాయి.
Maldives: ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ప్రభావం మాల్దీవులకు గట్టి దెబ్బలు తలుగుతున్నాయి. రోజూకు 400 విమానాల టికెట్లు రద్దు అవుతున్నాయి.
Arjun Suravaram
ప్రస్తుతం భారత్, మాల్దీవుల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం ప్రభావం మాత్రం మరింత పెరుగుతోంది. ముఖ్యంగా భారతీయులందరూ తమ దేశం పట్ల ప్రేమను, భక్తిని చూపిస్తూ.. అదే సమయంలో మాల్దీవులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు నిదర్శనం భారతీయులు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు. ఇండియన్స్ తీసుకుంటున్న నిర్ణయానికి మాల్దీవులు అల్లాడిపోతుంది. అనవసరంగా భారత్ తో పెట్టుకున్నామని ఇప్పుడు పశ్చాతాప పడుతున్నారు. అయితే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏమి లాభం ఉండదు కదా.. తాజాగా మాల్దీవులకు ఆర్థికంగా గట్టి దెబ్బలు తలుగుతున్నాయి.
భారత్ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో మాల్దీవులకు వెళ్తుంటారు. అందుకే ఇక్కడి నుంచి అనేక విమాన సర్వీస్ లు ఏర్పాటు చేశారు. రోజూ దాదాపు 8 విమాన సర్వీసులు మాల్దీవులకు నడుస్తుంటాయి. తాజాగా జరిగిన వివాదం నేపథ్యంలో విమానాలు రద్దవుతున్నాయి. అంతేకాక మాల్దీవులకు వెళ్లే ప్రయాణికుల్లో రోజుకు 300 నుంచి 400 మంది తమ విమానాల టికెట్లను రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది మాల్దీవులతో పాటు భారతీయ ఎయిర్‌లైన్స్‌పై ప్రభావం చూపుతోంది. దేశంపై ప్రేమతో పాటు ప్రధానమంత్రి పట్ల ఉన్న గౌరవం కారణంగా, ప్రజలు భుజం భుజం కలిపి నిలబడి ఉన్నారు. అందుకే మన దేశాన్ని అవమానించిన మాల్దీవులకు ఇలా గట్టి బుద్ది చెబుతున్నారు.
దేశంలోని ప్రసిద్ధ ట్రావెల్ సర్వీస్ పోర్టల్ బ్లూ స్టార్ ఎయిర్ ట్రావెల్ సర్వీసెస్ చెందిన మాధవ్ ఓజా మాట్లాడుతూ.. మాల్దీవుల పట్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని,దీని ప్రభావం ఇరు దేశాల మధ్య నడిచే విమాన సర్వీసులపైనా కనిపిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ దాదాపు 300 నుంచి 400 మంది తమ మాల్దీవుల ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారు. ఈ వివాదం రాకముందు గమనించినట్లు అయితే.. భారత దేశంలోని ప్రధాన నగరాల నుంచి మాల్దీవులకు నేరుగా విమానాలు ప్రారంభించినట్లు మాధవ్ ఓజా తెలిపారు. భారత్ నుంచి ప్రతిరోజూ దాదాపు 8 విమానాలు నేరుగా మాల్దీవులకు వెళ్తాయి. వీటిలో 3 విమానాలు ముంబై నుండి నేరుగా మాల్దీవులకు వెళ్తుంటాయి. మరో ఐదు విమానాలు హైదరాబాద్, కొచ్చి, బెంగళూరు, ఢిల్లీ నుండి మాల్దీవులకు నేరుగా విమానాలు ఉన్నాయి.
తాజా వివాదం ఈ విమాన సర్వీసులపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. రోజూ పెద్ద సంఖ్యలో బుకింగ్‌లు రద్దు అవుతున్నట్లుగా ఆయన తెలిపారు. మాల్దీవులు, భారత్ వివాదం లేక ముందు రోజూ 1200 నుంచి1300 మంది మాల్దీవులకు వెళ్తుండే వారని, తాజా వివాదంతో దాదాపు 20 నుంచి 30 శాతం మంది ప్రయాణికులు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నారని ఓజా తెలిపారు. 20 నుంచి 30 శాతం అంటే 300 నుంచి 400 మంది తమ విమానా టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. ఇది మాల్దీవుల వ్యాపారంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. దేశంలోని రెండవ అతిపెద్ద ట్రావెల్ బుకింగ్ యాప్ ‘ఈజీ మై ట్రిప్’ మాల్దీవులకు ప్రయాణికులను బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసింది.
ఈ పోర్టల్ సహ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ…తాము దేశంతో పాటు ప్రధాన మంత్రికి అండగా ఉంటామని తెలిపారు. ఇకపై మాల్దీవుల కోసం ఎటువంటి బుకింగ్ ప్రారంభించబోమని స్పష్టం చేశారు. సోమవారం, సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకుంటూ సహ వ్యవస్థాపకుడు తాము అన్ని బుకింగ్‌లను రద్దు చేసామని తెలిపారు. లక్షద్వీప్ కోసం ఐదు కొత్త ప్యాకేజీలను ప్రారంభించినట్లుగా తెలిపారు. మరి.. మాల్దీవుల వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#WATCH | Mumbai: On India-Maldives row, Madhav Oza, Director, Blue Star Air Travel Services says, “If we look at the overall picture then India-Maldives connections have improved over the last few years…There are eight direct flights from all over India to Maldives…Almost… pic.twitter.com/vn6Vw3yBCS
— ANI (@ANI) January 9, 2024