Arjun Suravaram
పెళ్లి అనేది ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని యువత భావిస్తుంది. పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా పెళ్లిళ్ల కోసం లక్షల కోట్లు ఖర్చు కానున్నాయి.
పెళ్లి అనేది ఓ మధురమైన ఘట్టం. అందుకే ఈ వేడుకను ఘనంగా జరుపుకోవాలని యువత భావిస్తుంది. పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా పెళ్లిళ్ల కోసం లక్షల కోట్లు ఖర్చు కానున్నాయి.
Arjun Suravaram
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ అందమైన, మధురమైన ఘటన. అందుకే ఈ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని యువత కోరుకుంటుంది. ట్రెండ్ కి తగ్గట్లు వెడ్డింగ్ ను చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఇక చాలా మంది పెళ్లికి పెట్టే ఖర్చు విషయంలో అసలు వెనుకడుగు వేయడం లేదు. అలానే ఏటా పెళ్లి ఖర్చులు కూడా బాగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు లక్షల కోట్లలో వ్యాపారం జరుగుతోంది. గతేడాది కూడా పెళ్లిళ్లకు భారీగా ఖర్చులు పెట్టారు. ఈ ఏడాది అంతకుమించే పెళ్లిళ్ల ఖర్చులు ఉండనుంది. డిసెంబర్ లో పెళ్లి మూహుర్తాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మూడు వారాల్లో 38 లక్షల పెళ్లిళ్లు జరగనున్నాయి. వీటి ఖర్చు రూ.4.74 లక్షల కోట్లు ఉంటుందని అంచనా.
మన దేశంలో కార్తీక మాసంతో పాటు పెళ్లిళ్ల మూహుర్తాలు ప్రారంభమయ్యాయి. పెళ్లిళ్ల ముహూర్తాలు ఈ నెల 23 నుంచి ప్రారంభమై డిసెంబర్ 15 వరకు ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్ 23, 24, 27, 28, 29 తేదీలు, డిసెంబర్‌లో 3, 4, 7, 8, 9, 15 తేదీలు శుభప్రదంగా ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో వివాహ వేడుకల డిమాండ్లను తీర్చడానికి భారతదేశ వ్యాపార సంఘం సిద్ధంగా ఉంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT)ప్రకారం.. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 కాలంలో ఈ మూడువారాల పాటు దేశవ్యాప్తంగా దాదాపు 38 లక్షల వివాహాలు జరగవచ్చని అంచన వేశారు. దీనికి దాదాపు రూ.4.74 లక్షల కోట్లు అవుతుందని అంచన.
పెళ్లి అంటే చిన్న విషయమేం కాదన్న సంగతి మనందరికి తెలిసిందే. పెళ్లి పత్రికల ప్రింటింగ్ నుంచి భోజనాల వరకు, బంధువులకు, అతిథులకు స్వాగతం దగ్గర నుంచి కొత్త జంటను ఒక్కటి చేసేవారు పెద్ద తతంగమే ఉంటుంది. దీని కోసం పసుపు కొమ్ముల నుంచి పసుపు వర్ణ బంగారం వరకు, భాజభజంత్రీల నుంచి వెడ్డింగ్ ప్లానర్స్ వరకు వందలాది వస్తువులు, సర్వీస్ అవసరం అవుతాయి. కేవలం పెళ్లి జరిపించే వారే కాదు.. బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా వివాహానికి వచ్చే అతిథుల ఇంధనం, రవాణ, బహుమతులు, హోటల్స్ ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తారు.
వీటన్నింటికీ కలిపి, ఈ మూడు వారాల్లోనే భారతీయులు రూ. 4.74 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని కాయిట్ అంచనా వేసింది. దీనిని మరోలా చెప్పాలంటే, కేవలం పెళ్లిళ్ల కోసమే రూ. 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరగబోతోంది. 2023లో ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా దాదాపు 32 లక్షల పెళ్లిళ్లు జరగ్గా.. అప్పుడు మొత్తం ఖర్చు రూ.3.75 లక్షల కోట్లు. దీనితో పోలీస్తే.. ఈ ఏడాది మరో 1 లక్ష కోట్లు అదనంగా వ్యాపారం జరగబోతుంది. ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్లో దేశ రాజధాని దిల్లీలోనే 4 లక్షలకు పైగా వివాహాలు జరగవచ్చని సీఎఐటీ అంచనా వేసింది. ఖర్చు కూడా రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని చెబుతోంది.
ఇక వివిధ స్థాయిలో జరిగే పెళ్లిళ్లు కాయిట్ ప్రకారం.. దాదాపు రూ.3 లక్షల ఖర్చుతో 7 లక్షల వివాహాలు జరగనున్నాయి. అలానే రూ.6 లక్షల వ్యయంతో 8 లక్షలు, రూ.10 లక్షలతో 10 లక్షల పెళ్లిలు జరగొచ్చు. అదే విధంగా రూ.15 లక్షల ఖర్చుతో 7 లక్షల వరకు పెళ్లిళ్లు జరగుతాయి. రూ.25 లక్షలతో 5 లక్షల వివాహాలు, రూ.50 లక్షలతో 50 వేల వివాహాలు, రూ.కోటికి పైగా ఖర్చుతో మరో 50 వేల పెళ్లిళ్లు జరగొచ్చని అంచనా. 2023 నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 పెళ్లి మూహుర్తాలు ఉన్నాయి. ఆ తరువా 2024 జనవరి నుంచి జులై మధ్య వివిధ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మరి.. ఈ ఏడాది జరగనున్న పెళ్లిళ్లు, వాటి ఖర్చులపై కాయిట్ వేసిన అంచనాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.