Maharashtra News: మహారాష్ట్రలో 257 మంది విద్యార్థులకు అస్వస్థత...విషయం తెలిసి షాకైన అధికారులు!

మహారాష్ట్రలో 257 మంది విద్యార్థులకు అస్వస్థత…విషయం తెలిసి షాకైన అధికారులు!

Maharashtra News: నాణ్యతలేని ఆహారం, ఇతర బయటి ఫుడ్స్ తినడం వలన అనేక దారుణాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో స్కూల్లలో కూడా పిల్లలు అస్వస్థతకు గురవుతుంటారు. తాజాగా ఓ పాఠశాలలో బిస్కెట్లు తిని 257 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

Maharashtra News: నాణ్యతలేని ఆహారం, ఇతర బయటి ఫుడ్స్ తినడం వలన అనేక దారుణాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో స్కూల్లలో కూడా పిల్లలు అస్వస్థతకు గురవుతుంటారు. తాజాగా ఓ పాఠశాలలో బిస్కెట్లు తిని 257 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

తరచూ  ఏదో ఒక ప్రాంతంలో వివిధ కారణాలతో కొందరు అస్వస్థతకు గురవుతుంటారు. కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు విషాదాన్ని నింపుతాయి. గతంలో ఇలా అస్వస్థతకు గురై పలువురు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. అలానే నాణ్యతలేని ఆహారం, ఇతర బయటి ఫుడ్స్ తినడం వలన అనేక దారుణాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో స్కూల్లలో కూడా పిల్లలు అస్వస్థతకు గురవుతుంటారు. తాజాగా ఓ పాఠశాలలో బిస్కెట్లు తిని 257 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మరి.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం…

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లోని జిల్లా కౌన్సిల్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పౌష్టికాహాం కార్యక్రమంలో భాగంగా బిస్కెట్లు తిని  విద్యార్థులు అస్వస్థతు గురయ్యారు. శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పౌష్టికాహారంలో భాగంగా విద్యార్థులకు బిస్కెట్లు అందించారు. అవి తిన్న కాసేపటికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది విద్యార్థుల్లో వాంతులు, వికారం వంటి ప్రారంభమయ్యాయని స్థానిక అధికారులు తెలిపారు. ఇక వెంటనే పిల్లల పరిస్థితి గమనించిన స్థానిక గ్రామస్తులు, అధికారులు అప్రమత్తమయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మొత్తం 257 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగినట్లు స్థానిక ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బిస్కెట్లు తిన్నడం కారణంగానే పుడ్ పాయింజన్ జరిగిందని వైద్యులు తెలిపారు. ఈ 257 మందిలో 153 మందిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కొందరికి చికిత్స అందించిన అనంతరం ఇంటికి పంపారు. మరికొందరికి మాత్రం ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఏడుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఛత్రపతి శంభాజీనగర్ సివిల్ ఆసుపత్రికి పంపించామని చెప్పారు. ఫుడ్ పాయిజనింగ్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాలలో మొత్తం 296 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 257 మందికి మాత్రమే పుడ్ పాయిజన్ అయ్యింది.

గతంలోను చాలా మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అలానే ఓ ప్రాంతంలో షవర్మా తిని  ఏకంగా 12 మంది విద్యార్థులు చావు అంచులదాకా వెళ్లి వచ్చారు. నాణ్యతలేని  ఫుడ్, ఇతర ఆహార పదార్థాలను సరఫరా చేయడం కారణంగానే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. స్థానికులు అంటున్నారు. పాఠశాలల్లో నాణ్యమైన ఆహారాన్ని మాత్రం అందించాలని, నాణ్యత లేకుంటే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికిలు డిమాండ్ చేస్తున్నారు. మరి.. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనపై మీ అప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments