P Krishna
P Krishna
ఇటీవల పలు బ్యాంకులు చేస్తున్న తప్పిదాల వల్ల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఖాతాల్లో ఉన్నట్టుండి డబ్బు మాయం అవుతుంది.. మరికొంతమంది ఖాతాల్లోకి అకస్మాత్తుగా లక్షలు, కోట్లు వచ్చి పడుతుంటాయి. ఆ సమయంలో బ్యాంకు ఖాతాదారులు ఆనందంతో పొంగిపోతుంటారు.. తీరా బ్యాంకుకు వెళ్లి అసలు నిజం తెలుసుకొని షాక్ తింటారు. కొన్నిసార్లు పెద్ద ఎత్తున తమ అకౌంట్ డబ్బు జమ కావడంతో భయపడిపోతుంటారు. అలాంటి సంఘటనే హరియాణలో చోటు చేసుకుంది. ఓ వ్యవసాయదారుడి బ్యాంకు ఖాతాలో రూ.200 జమ కావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు.. తనకు రక్షణ కల్పించండి బాబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హరియానాలోని చక్రీ దాద్రి జిల్లాకు చెందిన విక్రమ్ తన కుటుంబంతో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. గురువారం విక్రమ్ తన బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు బ్యాంక్ కి వెళ్లాడు. అక్కడ అధికారులు చెప్పిన విషయం తెలుసుకొని ఒక్కసారే షాక్ తిన్నాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రెండు వందల కోట్లు అతని ఖాతాలో జమ అయ్యాయని అధికారులు చెప్పారు. దీంతో తనకు తన కుటుంబానికి ప్రాణాపాయం ఉందని గ్రామస్థులను తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు. విక్రమ్ బ్యాంకు ఖాతాలో అంత డబ్బు ఎలా జమ అయ్యింది అన్న విషయంపై పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు.
ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు మరో వెర్షన్ చెబుతున్నారు. విక్రమ్ ఖాతాలో కేవలం రూ.60 వేలు మాత్రమే గుర్తించామని.. అతడు అంటున్నట్లుగా తన ఖాతాలో రూ.200 కోట్లు లేవని అన్నారు. అలాగే అంత పెద్ద మొత్తం విక్రమ్ అకౌంట్ లో ఎలా జమ అయ్యింది.. ఎవరు డిపాజిట్ చేశారు, ఎందుకు చేశారు అన్న వివరాలను బ్యాంక్ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. బ్యాంక్ స్టేట్ మెంట్ సహా ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటాం అని.. పూర్తి విచారణలో చేసిన తర్వాత అంత డబ్బు విక్రమ్ ఖాతాలో జమ అయ్యిందో చెప్పగలం అని బద్రా పోలీస్ స్టేషన్ అధికారు తెలిపారు.