iDreamPost
android-app
ios-app

ఏడాది క్రితం చనిపోయిన తల్లి.. డెడ్ బాడీతోనే కలిసుంటున్న కుమార్తెలు

  • Published Nov 30, 2023 | 2:14 PM Updated Updated Nov 30, 2023 | 2:14 PM

ఏడాది క్రితం చనిపోయిన తల్లి డెడ్ బాడీతో కలిసి ఉంటున్నారు ఇద్దరు యువతులు. అసలేం జరిగింది.. వాళ్లు ఎందుకు ఇలా చేశారంటే..

ఏడాది క్రితం చనిపోయిన తల్లి డెడ్ బాడీతో కలిసి ఉంటున్నారు ఇద్దరు యువతులు. అసలేం జరిగింది.. వాళ్లు ఎందుకు ఇలా చేశారంటే..

  • Published Nov 30, 2023 | 2:14 PMUpdated Nov 30, 2023 | 2:14 PM
ఏడాది క్రితం చనిపోయిన తల్లి.. డెడ్ బాడీతోనే కలిసుంటున్న కుమార్తెలు

లోకంలో మనకంటూ ఎవరూ లేకపోయినా సరే.. అమ్మ అనే ఒక్క బంధం ఉంటే చాలు.. సంతోషంగా బతకవచ్చు. తల్లి అంటేనే బిడ్డలకు కొండంత ధైర్యం. అమ్మ పక్కన ఉంటే చాలు.. ఎలాంటి భయాలు మన దరి చేరవు. ఇక అమ్మ ప్రేమను ఎంత పొందినా తనివి తీరదు. తల్లి లేని బాధ గురించి ఎంత వర్ణించినా తక్కువే. అమ్మ లేని లోటును ఎవరు తీర్చలేరు అన్నది వాస్తవం. ఇప్పుడు మనం చెప్పుకొబోయే యువతులకు కూడా తల్లి అంటే అపారమైన ప్రేమ. నిత్యం అమ్మ గురించే ఆలోచిస్తుండేవారు. ఆ పిచ్చి ప్రేమ తోనే తల్లి మరణించింది అన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఏడాది పాటు కన్నతల్లి మృతదేహాన్ని తమతో పాటే అట్టి పెట్టుకున్నారు. ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్ ప్రదేశ్ లో ఈ ఓ దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది.. దాదాపు ఏడాది క్రితం మరణించిన తల్లి ఉషా తివారీ (52) కుళ్లిపోయిన మృతదేహంతో 27 ఏళ్ల పల్లవి, ఆమె సోదరి వైష్విక్ (18) నివసిస్తుండటం ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేస్తొంది. డిసెంబర్ 8, 2022న ఉషా తివారి మరణించింది. అయితే ఆమె కుమార్తెలిద్దరూ అంత్యక్రియలు చేయకుండా.. తల్లి డెడ్ బాడీని తమతో పాటే ఉంచుకున్నారు. వారణాసిలోని లంక పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదేర్వ చిట్టుపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ..’’పల్లవి త్రిపాఠి, వైశ్విక్ త్రిపాఠి ఇద్దరూ వారం రోజుల నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. తలుపులు మూసే ఉన్నాయి. దాంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు తలుపు తట్టగా లోపలి నుంచి ఎలాంటి సమాధానం లేదు. దాంతో వారు మాకు సమాచారం అందించారు. ఫిర్యాదు రావడంతో ఉషా తివారి ఇంటికి వద్దకు వచ్చి.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాము‘‘ అని తెలిపారు.

’’ఇంటి లోపల పల్లవి, వైశ్విక్ ఇద్దరూ తమ తల్లి డెడ్ బాడీని పక్కన పెట్టుకుని ఉన్నారు. ఆమె దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ గత ఏడాది అనగా డిసెంబర్ 8, 2022 లో చనిపోయింది. కానీ కుమార్తెలిద్దరూ ఉషా తివారి అంత్యక్రియలు నిర్వహించలేదు. పైగా వీరిద్దరికి మతి స్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. తల్లి లేకుండా బతకలేమనే భయంతో.. ఉషా తివారి కుమార్తెలిద్దరూ ఆమె డెడ్ బాడీని ఇంట్లోనే పెట్టుకుని.. దానితోనే కలిసి ఉంటున్నారు. ప్రస్తుతం వారిద్దరిని అదుపులోకి తీసుకున్నాము‘‘ అని తెలిపారు.

అంతేకాక పల్లవి మాస్టర్ డిగ్రీ పూర్తి చేయగా.. ఆమె సోదరి వైశ్విక్ ప్రస్తుతం 10వ తరగతి చదువుతుందని పోలీసులు వెల్లడించారు. అంతేకాక బల్లియాలో ఉంటున్న వీరి తండ్రి గత రెండేళ్లుగా భార్యాపిల్లలను కలవడానికి రావడం లేదని.. డిప్రెషన్ కు గురైన యువతులు.. తల్లి కూడా తమను వదిలి వెళ్లడం తట్టుకోలేక ఇలాంటి పని చేశారని తెలిపారు.