Arjun Suravaram
Gujarat: ఏటా లక్షల మంది చదువును పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం చూస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా తక్కువ మందికి మాత్రం జాబ్ లు వస్తున్నాయి. మిగిలిన వారు జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఈ క్రమంలో ఓ వీడియో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Gujarat: ఏటా లక్షల మంది చదువును పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం చూస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా తక్కువ మందికి మాత్రం జాబ్ లు వస్తున్నాయి. మిగిలిన వారు జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ ఈ క్రమంలో ఓ వీడియో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Arjun Suravaram
ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని పలువురు మేధావులు చెబుతున్నారు. అందుకు నిదర్శనంగా తరచూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఏటా లక్షల మంది చదువును పూర్తి చేసి.. ఉద్యోగాల కోసం చూస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా తక్కువ మందికి మాత్రం జాబ్ లు వస్తున్నాయి. మిగిలిన వారు జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలో ఎక్కడ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన సరే భారీగా సంఖ్యలో వెళ్తుంటారు. కొన్ని సార్లు జాబ్ మేళా సందర్భంలో వచ్చే నిరుద్యోగుల సంఖ్యను చూస్తే.. ఆశ్చర్యం కలగక మానదు. తాజాగా ఓ వీడియో దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి నిదర్శనం నిల్చింది. అంతేకాక ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.
గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని ఝగాడియాలో గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేంద్రేంగా థెర్మాక్స్ గ్లోబల్ అనే సంస్థ పని చేస్తుంది. ఈ సంస్థ అంక్లేశ్వర్ లో ఓ హోటల్ లో పది ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ క్రమంలో ఊహించని రీతిలో అభ్యర్థులు ఇంటర్వూకి హాజరయ్యారు. ఇక ఈ ఇంటర్వ్యూకి 1800 మంది రావడం జరిగింది. అంతేకాక లోపలికి వెళ్లేందుకు క్యూ పద్ధతి పాటించకపోవడంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో హోటల్ ముందు ఏర్పాటు చేసిన రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో పలువురు కింద పడిపోయారు. ఈ ఘటన సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.
అంతేకాక కొందరు నెటిజన్లు సైతం ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు. ఇదే అవకాశంగా భావించిన అక్కడి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్..సెటైర్లు వేసింది. బీజేపీ పాలిత గుజరాత్‌లో నిరుద్యోగం ఎలా తాండవిస్తుందో చూడండి అంటూ తన ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇదేనా గుజరాత్ మోడల్ అంటూ విమర్శలు గుప్పించింది. గుజరాత్ రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని ప్రస్తుత ప్రభుత్వం దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ విమర్శలకు గుజరాత్ బీజేపీ కూడా ధీటుగానే స్పందించింది. ఈ కంపెనీలో జరిగే ఇంటర్వ్యూలో అనుభవం ఉన్నవారికే అని తెలిపింది. కాబట్టి అక్కడి వచ్చిన వారంతా నిరుద్యోగులు కాదని ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇరు పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు పక్కన పెడితే… వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
📽️ Watch | Railing Collapses As 1,800 Aspirants Turn Up For 10 Jobs In Gujarat https://t.co/Vy4eJUjq2b pic.twitter.com/87fdRurayS
— NDTV (@ndtv) July 11, 2024