iDreamPost
android-app
ios-app

రైతు బిడ్డ తయారు చేసిన సూపర్ యాప్! టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు..

ప్రతిభ అనేది ఎవరి సొంతం కాదు. అలానే వయస్సుతో సంబంధం కూడా లేదు. తమ ప్రతిభతో చరిత్రలో నిలిచిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ రైతు బిడ్డ తయారు చేసిన యాప్ అందరిని ఆకట్టుకుంది.

ప్రతిభ అనేది ఎవరి సొంతం కాదు. అలానే వయస్సుతో సంబంధం కూడా లేదు. తమ ప్రతిభతో చరిత్రలో నిలిచిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఓ రైతు బిడ్డ తయారు చేసిన యాప్ అందరిని ఆకట్టుకుంది.

రైతు బిడ్డ తయారు చేసిన సూపర్ యాప్! టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదు..

“ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్” అని రచయితలు పాటలు రాస్తుంటారు. అది కేవలం పాటే కాదు.. వాస్తవంగా కూడా నిజం. ఆస్తులు, అంతస్తులు, ధనం ఒకడి సొత్తు కావచ్చు.. కానీ టాలెంట్ అనేది ఏ ఒక్కడి సొత్తు కాదు. అందుకే నైపుణ్యం కలిగిన ఎందరో చీకటిని చీల్చుకుంటూ సూర్యుడిలా వెలుగుని ఇస్తున్నారు. అలానే ప్రతిభకు వయస్సుకు సంబంధం లేదు. ఎందరో చిన్నారులు సైతం తమ ప్రతిభతో అందరిని ఆకట్టుకున్నారు. తాజాగా 14 ఏళ్ల పాప… రైతుల కోసం ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఆ బాలిక తయారు చేసిన యాప్ అందరిని ఆకట్టుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని  లలిత్ పూజ్ జిల్లా పాథ్ అనే గ్రామంలో నందిని అనే 14 ఏళ్ల బాలిక.. తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె ప్రభుత్వ బడిలో తొమ్మిదో తరగతి చదువుతోంది. వారిది వ్యవసాయం కుటుంబం. నందిని తండ్రి నిత్యం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇక నందినికి చదువుతో పాటు టెక్నాలజీ పై ఆసక్తి ఎక్కువగా ఉంది. అందుకే తన స్కూల్ జరిగే ఏ సైన్స్ ప్రోగ్రామ్ లోనైన నందిని పాల్గొంటుంది.

  అలానే నందిని వాళ్ల పాఠశాల నుంచి  ‘రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్ ‘ అనే ప్రాజెక్ట్ ద్వారా టీచర్లతో కలిసి పిల్లలంతా ఏఐ వెబ్ సైట్ ని తయారు చేశారు. దాని నుంచి నందిని స్ఫూర్తి పొందారు. ఇక తరచూ ఏదో కొత్త్ టెక్నాలజీ కోసం పరిశోధిస్తున్నారు.  ఆమె డెడికేషన్ చూసిన ఇంటెల్ సంస్థ నందినికి కొత్త్ ల్యాప్ టాప్ గిఫ్ట్ గా ఇచ్చింది.  ఆ బహుమతి నందినికి మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదే ఉత్సాహంతో కొత్తగా ఏదైనా చేయాలని ఆమె భావించింది.

అదే సమయంలో రైతులు భూసార పరీక్షల గురించి మాట్లాడుకోవడం నందిని చెవిన పడింది. ఎప్పుడూ రైతులు అగ్రికల్చర్ ఆఫీసు వెళ్లి. . మట్టి పరీక్షల కోసం వాళ్లు పడే ఇబ్బంది,  నేల నాణ్యత తెలుసుకోకుండా పంటలు వేసి కొందరు రైతులు నష్టపోవడం గమనించింది. పాఠశాలలో తయారు చేసిన వెబ్ సైట్ మాదిరి ఫోన్ యాప్ ను రైతుల కోసం తయారు చేయాలనుకుంది. అందుకు తన గణిత ఉపాధ్యాయురాలి సాయం తీసుకుంది. తన ప్రాజెక్ట్ కు ‘మిట్టికో జానో, ఫలస్ పెహచానో’ అని పేరు పెట్టింది. ఈ ప్రాజెక్ట్ కింద ఏఐ యాప్ ను తయారు చేసింది.

నేలలోని ఉష్ణోగ్రత, నెట్రోజన్, ఇతర పోషక విలువలను తెసుకుకొని, దానికి తగ్గట్లు పంటను ఈ యాప్ సూచిస్తుంది. స్మార్ట్ డేటా ఆధారంగా ఇది పని చేస్తుందంట. రైతులు కూడా ఈ యాప్ ని చాలా సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ పూర్తి ప్రాజెక్ట్ ను ఢిల్లీలో జరిగిన నేషనల్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ఆ యాప్ ను చూసి.. చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ కుమార్ పాండే  ఫిదా అయ్యారు.

జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర విద్యార్థులను ఈ ప్రాజెక్ట్ ఇన్ స్ఫైర్ చేస్తుందని తెలిపారు. రైతులకు ఎంతో ఉపయోగ పడుతుందని అనిల్ పాండే తెలిపారు. ఈ  ఎగ్జిబిషన్ లో ఉత్తర ప్రదేశ్ నుంచి పాల్గొన్న ఏకైక అమ్మాయి నందిని కావడం విశేషం. ఇక రైతులకు ఉపయోగ పడే యాప్ ను రూపొందించిన ఈ బాలికపై రాష్ట్ర నలుమూలల నుంచి ప్రశంసలు కురుస్తోన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి