iDreamPost
android-app
ios-app

తీహార్ జైలులో తీవ్ర కలకలం.. 125 మంది ఖైదీలు HIV పాజిటివ్‌!

  • Published Jul 27, 2024 | 5:11 PM Updated Updated Jul 27, 2024 | 5:11 PM

Tihar Jail: సాధారణంగా జైలులో తీవ్ర నేరాలకు పాల్పపడిన వారిని, హంతకులను ఉంచుతారు. ఇటీవల ఎంతో పటిష్టంగా ఉండే జైలులో కూడా హెచ్ఐవీ కేసులు బయటపడటం తీవ్ర కలకలం రేపుతుంది.

Tihar Jail: సాధారణంగా జైలులో తీవ్ర నేరాలకు పాల్పపడిన వారిని, హంతకులను ఉంచుతారు. ఇటీవల ఎంతో పటిష్టంగా ఉండే జైలులో కూడా హెచ్ఐవీ కేసులు బయటపడటం తీవ్ర కలకలం రేపుతుంది.

తీహార్  జైలులో తీవ్ర కలకలం.. 125 మంది ఖైదీలు HIV పాజిటివ్‌!

కరడు గట్టిన నేరస్తులను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలిస్తుంటారు. సామాన్యలు నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఎవరు తప్పు చేసినా తీహార్ జైలుకు తరలించడం వల్ల తరుచూ ఈ పేరు వినిపస్తూనే ఉంటుంది. ఆ మధ్య ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో జైలులో హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించగా అందులో 36 మందికి పాజీటీవ్ ఉన్నట్లు తేలింది. అలాగే ఉత్తరాఖాండ్ లోని హల్ద్ వాని జైలులో మహిళలతో సహా 44 మంది హెచ్ఐవీ భారిన పడటంత తీవ్ర కలకలం రేపింది. నేరస్థులు విచ్చలవిడిగా తిరగడం వల్ల ఇలాంటి రోగాల భారిన పడుతున్నారని జైలు అధికారులు అంటున్నారు. తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలులో హెచ్ఐవీ కేసులు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలు (తీహార్, రోహిణి, మండోలి) నుంచి ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటీవ్ గా గుర్తించారు. ఈ కేసులు ఖైదీలకు కొత్తేం కాదు.. 200 మంది ఖైదీలు సిఫిలిస్ వ్యాధి భారిన పడినట్లు తెలుస్తుంది. ఇటీవల 10 వేల 500 మంది ఖైదీలకు హెచ్ ఐవీ వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ జైలులో 14000 మంది ఖైదీలు ఉన్నట్లు సమాచారం. దేశంలో అవినీతి, అక్రమాలు, హత్యలు, భారీ కుంభకోణాలకు పాల్పపడిన వారికి తీహార్ జైలుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. తీహార్ జైలులో ఎప్పటికప్పుడు మెడికల్ స్క్రీనింగ్ జరుగుతూనే ఉంటుంది.

HIV Positive in Tihar jail

ఇటీవల వచ్చిన డీజీ సతీష్ గోల్చా తీహార్ జైలు బాధ్యతలు చేపట్టారు. ఆయన వచ్చిన తర్వాత మెడికల్ చెకప్ చేయించారు. ఇందులో 125 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటీవ్ అని తేలింది. ఇటీవల ఇలాంటి కేసులు రాలేదని అధికారులు అంటున్నారు. వివిధ కారణాల వల్ల బయటకు వెళ్లిన వారు జైలుకు వచ్చినపుడు వైద్య పరీక్షలు చేయగా ఇలా హెచ్ఐవీ నిర్దారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. 10,500 మంది ఖైదీల్లో 200 మంది ఖైదీలకు సిఫిలిస్ వ్యాధి స్కీన్ ఇన్పెక్షన్ ఉన్నట్లు తేలింది. ఈ ఖైదీల్లో కొంతమంది టీబీ వ్యాది గ్రస్తులే అంటున్నారు అధికారులు.