విచిత్ర వివాహం: 103 ఏళ్ల వృద్ధుడితో 49ఏళ్ల మహిళ పెళ్లి!

తరచూ కొన్ని విచిత్రమైన, ఆశ్చర్యకరమైన వివాహలకు సంబంధించిన వార్తలు మనం చూస్తుంటాము. అలానే తాజాగా ఓ ప్రత్యేకమైన వివాహం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 103 ఏళ్ల వృద్ధుడిని 49 ఏళ్ల మహిళ వివాహం చేసుకుంది.

తరచూ కొన్ని విచిత్రమైన, ఆశ్చర్యకరమైన వివాహలకు సంబంధించిన వార్తలు మనం చూస్తుంటాము. అలానే తాజాగా ఓ ప్రత్యేకమైన వివాహం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 103 ఏళ్ల వృద్ధుడిని 49 ఏళ్ల మహిళ వివాహం చేసుకుంది.

పెళ్లి అనేది ఎంతో గొప్ప వేడుక. రెండు వేరువేరు మనస్సులు..పెళ్లి అనే బంధం ద్వారా ఒకటవుతుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని భావిస్తుంటారు. అయితే కొన్ని పెళ్లిళ్లు, ప్రేమలు మాత్రం మనకు ఆశ్చర్యానికి కలిగిస్తుంటాయి. సరైన వయస్సు, ఒకే ఏజ్ లో ఉన్న వాళ్ల ప్రేమలు, పెళ్లిళ్లలో విషయంలో పెద్ద ఆసక్తి ఏమి ఉండదు.అయితే కొందరు కూతురు వయస్సున అమ్మాయిని, తండ్రి వయస్సు ఉండే పురుషులను వివాహం చేసుకుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఈవీరికి ఏమైంది, మెదడు కానీ చితికిందా అనే భావనలు కలుగుతుంటాయి. అయితే వారి వారి పరిస్థితుల దృష్ట్యా అలాంటి విచిత్రమైన వివాహలు చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. మధ్యప్రదేశ్ లోను అలాంటి అరుదైన, ఆశ్చర్యకరమైన వివాహం ఒకటి జరిగింది.

మధ్యప్రదేశ్ లో విచిత్రమైన వివాహం జరిగింది. భోపాల్ కు చెందిన హబీబ్ నజర్ వయస్సు 103 ఏళ్లు. ఆయన ప్రస్తుతం వృద్ధప్యంతో బాధపడుతున్నారు.హబీబ్ దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. అంతేకాక దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అడ్డుపెట్టి మరీ పోరాడారు. 103 ఏళ్ల హబీబ్ నజర్ కు గతంలో రెండు వివాహాలు జరిగాయి. ఆ ఇద్దరు భార్యలు వివిధ కారణాలతో మరణించారు. ఆ తరువాత ఆయనను పట్టించుకునే రు లేకుండా పోయారు. ప్రస్తుతం 103 ఏళ్ల వయస్సులో వృద్ధప్యంతో బాధపడుతున్నారు. అంతేకాక ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ ఒంటరితనంతో హాజిబ్ నజర్ ఎంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే తనకు ఒకతోడు కావాలని భావించి.. మరో పెళ్లి చేసుకున్నారు. భర్తను కోల్పోయిన 49 ఏళ్ల ఫిరోజ్‌ జహన్‌ను వివాహమాడారు. గతేడాదే వీరి పెళ్లి జరిగ్గా.. తాజాగా  వీరికి సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

నజర్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ… జీవితంలో తనకు ఎలాంటి లోటు లేదని, రెండో భార్య మరణించిన తరువాత ఒంటరిగా ఉండిపోయాని తెలిపారు. అయితే ఆ ఒంటరితనంతో జీవించలేకపోయాని, అందుకే ఫిరోజ్ అనుమతితో, ఆమె ఇష్టం మేరకే మూడో వివాహం చేసుకున్నానని అని పేర్కొన్నారు. ఇకే సమయంలో సదరు మహిళా కూడా..తన వివాహంపై స్పందించారు. తాను ఓ వృద్ధుడిని పెళ్లి చేసుకోవడంలో ఎవరి బలవంతం లేదని, ఆయన కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆమె తెలిపింది. అయితే తన కంటే వయసులో 54 ఏళ్ల చిన్నదైన మహిళను వివాహం చేసుకోవడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. వీరి పెళ్లిని కొందరు సమర్థించగా, మరికొందరు వ్యతిరేకించారు. ప్రస్తుతం ఈ నూతన వధువరుల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. మరి.. ఈ విచిత్ర వివాహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments