iDreamPost

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు.. 100పైగా రోడ్లు మూసివేత!

కొన్ని రోజుల నుంచి నైరుతి బుతుపవనాల కారణంగ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వారం క్రితం వరకు కూడా  ఉత్తర భారత దేశంలో ఎండలు దంచికొట్టగా.. ఇటీవల కొన్ని రోజుల నుంచి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది.

కొన్ని రోజుల నుంచి నైరుతి బుతుపవనాల కారణంగ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వారం క్రితం వరకు కూడా  ఉత్తర భారత దేశంలో ఎండలు దంచికొట్టగా.. ఇటీవల కొన్ని రోజుల నుంచి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది.

ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు.. 100పైగా రోడ్లు మూసివేత!

ఒక నెల క్రితం వరకు దేశ వ్యాప్తంగా విపరీతమైన ఎండలు వచ్చాయి. ఇక సూర్యుడి తాపానికి జనాలు అల్లాడిపోయారు. ఇది ఇలా ఉంటే…కొన్ని రోజుల నుంచి నైరుతి బుతుపవనాల కారణంగ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీగా వానాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వారం క్రితం వరకు కూడా  ఉత్తర భారత దేశంలో ఎండలు దంచికొట్టగా.. ఇటీవల కొన్ని రోజుల నుంచి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  దాదాపు 100కు పైగా రోడ్లను మూసివేసి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కొన్ని రోజులు నుంచి ఉత్తరాఖండ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాలు చెరువులను, నదులను తలపిస్తున్నాయి. ఇక ఆ రాష్ట్ర గుండ వెళ్లే ప్రధాన నదులన్ని ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక రోడ్లు జలదిగ్భందంలో ఉండిపోయాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించబడింది. ఇటీవల రెండు రోజుల నుంచి కురిసిన భారీ వానలకు ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పితోరాఘర్, ఉధంసింగ్ నగర్, కుమావోన్‌ల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. డెహ్రాడూన్, పౌరీ, తెహ్రీ, హరిద్వార్‌ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ స్థాయిలో కురుస్తున్న వానల కారణంగా గంగా, అలకనంద, భాగీరథి, శారద, మందాకిని, కోసి నదుల్లో నీటిమట్టం భారీగా పెరిగింది.

దీంతో దాదాపు 100కు పైగా రహదారులు మూసుకుపోయాయి. ఇక రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది ఉప్పొంగడంతో అక్కడ ఉండే శివుని విగ్రహం 10 అడుగుల మేర నీట మునిగింది. భారీ వరద కారణంగా లోతట్టు ప్రాంతాలకు, నదీ తీరాలకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను హెచ్చరించింది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై పీపాల్ కోఠి సమీపంలోని పాగల్ నల్, మాల్వాకు వెళ్లే రహదారి కొండచరియలు విరిగిపడాయి. దీంతో మార్గం పూర్తిగా మూసుకుపోయింది. అదే విధంగా యమునోత్రి హైవే, ధార్చుల, తవా ఘాట్ రోడ్లు మూసుకుపోయాయి. మొత్తంగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు తీవ్ర స్థాయిలో  ప్రవహిస్తుంది.

పౌరీ, నైనిటాల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వేతర పాఠశాలలు మూసివేయబడ్డాయి. విపత్తు సంభవించినప్పుడు తక్షణమే రక్షించడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా మేజిస్ట్రేట్‌లకు సూచించబడింది. విపత్తు నిర్వహణ శాఖలతో పాటు జాతీయ విపత్తు రెస్క్యూ ఫోర్స్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గంగ, సరయూ ప్రమాదకర స్థాయికి కొన్ని మీటర్ల దిగువన ప్రవహిస్తుండగా అలకనంద, మందకాని, భాగీరథి నదులు ప్రమాద స్థాయిని దాటాయి. గోమతి, కాళీ, గౌరీ, శారదా నదుల నీటిమట్టం కూడా పెరుగుతోంది. బద్రీనాథ్ జాతీయ రహదారిపై పీపాల్ కోఠి సమీపంలోని పాగల్ నల్, మాల్వాకు వెళ్లే రహదారి కొండచరియలు విరిగిపడటంతో మూసుకుపోయింది. యమునోత్రి హైవే, ధార్చుల, తవా ఘాట్ జాతీయ రహదారిపై కూడా రోడ్లు మూసుకుపోయాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి