iDreamPost
android-app
ios-app

YVS చౌదరి స్పెషల్ ట్వీట్.. ఇక నుంచి ఫ్యాన్స్ కు టచ్ లో NTR

  • Published Nov 06, 2024 | 3:59 PM Updated Updated Nov 06, 2024 | 4:01 PM

YVS Chowdary Special Tweet : ఇప్పుడు నందమూరి వంశం నుంచి నాలుగో తరం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా నందమూరి తారకరామారావు ముని మనవడు.. ఎన్టీఆర్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు YVS చౌదరి. అయితే ఈరోజు ఈ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటో చూసేద్దాం.

YVS Chowdary Special Tweet : ఇప్పుడు నందమూరి వంశం నుంచి నాలుగో తరం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా నందమూరి తారకరామారావు ముని మనవడు.. ఎన్టీఆర్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు YVS చౌదరి. అయితే ఈరోజు ఈ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Nov 06, 2024 | 3:59 PMUpdated Nov 06, 2024 | 4:01 PM
YVS చౌదరి స్పెషల్ ట్వీట్.. ఇక నుంచి ఫ్యాన్స్ కు టచ్ లో NTR

ఇప్పటివరకు ఎన్టీఆర్ అంటే అందరికి గుర్తొచ్చేది ఇద్దరే.. విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్).. ఆ తర్వాత ఆయన మనవడు మ్యాన్ ఆఫ్ ది మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. కానీ ఇకపై ఆ లెగసిని కంటిన్యూ చేయడానికి నందమూరి వంశం నుంచి నాలుగో తరం ఎంటర్ అయింది. సీనియర్ ఎన్టీఆర్ ముని మనుమడు.. జానకి రామ్ కుమారుడు.. ఎన్టీఆర్ ను రీసెంట్ గా YVS చౌదరి ఇండస్ట్రీ కి పరిచయం చేశారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖుల దగ్గర నుంచి.. వివిధ రంగాలలో స్థిరపడిన నందమూరి కుటుంబ సభ్యుల వరకు.. అంతా ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నిన్న మొన్నటి వరకు కూడా మీడియా సోషల్ మీడియాలో ఆ పిక్స్ , పోస్ట్స్ తెగ వైరల్ అయ్యాయి. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సంధర్బంగా సోషల్ మీడియాలో మరో పోస్ట్ వైరల్ అవుతుంది.

న్యూ టాలెంట్ రోల్స్ సంస్థ తరపున.. YVS చౌదరి దర్శకత్వంలో ఈ యంగ్ హీరో పరిచయం కాబోతున్నాడు. ఈ విషయంలో అందరికి ఓ క్లారిటీ వచ్చింది. ఈ హీరోను పరిచయం చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ కు అటు న్యూ టాలెంట్ రోల్స్ సంస్థ కూడా ఆనందించారు. చెప్పాలంటే ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమాభిమానాలకు ఒకింత ఎక్కువే ఉప్పొంగిపోయారు. దీనితో తమ అభిమాన హీరో ముని మనుమడిని ఎలా చూడాలనుకుంటున్నారో కూడా ప్రేక్షకులకే వదిలేశారు. అంటే ఇప్పటినుంచి ఎన్టీఆర్ కు సంబంధించి ఎవరైనా సలహాలు , సూచనలు ఇవ్వాలనుకుంటే.. నేరుగా సోషల్ మీడియా ద్వారా పంపించవచ్చట. దానికోసం ట్విట్టర్ లో @NTRoffl , ఇన్స్టాగ్రామ్ లో @nanadamuritarakaramarao_ , ఫేస్ బుక్ లో Nandamuri Taraka Ramarao ఐడి లను కూడా ట్యాగ్ చేశారు. కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే నేరుగా ఆ ఐడి ల ద్వారా సలహాలు అందించవచ్చు.

సాధారణంగా ఏదైనా సినిమా చూసేటప్పుడు.. మా హీరోను ఈ యాంగిల్ లో చూపిస్తే బావుండేది.. మా హీరో లుక్ ఇలా ఉంటే బావుండేది.. ఈ క్యారెక్టర్ కైతే మా వాడు బాగా సూట్ అయ్యేవాడు. అని  అభిమానులు హీరోలను చాలా ఓన్ చేసుకుని మాట్లాడుతుంటారు. కానీ అవి మాటలు మహా అయితే సోషల్ మీడియాలో కామెంట్ల వరకే పరిమితం అయ్యేవి.  ఈ క్రమంలో  అభిమానులలో ఎక్కడో ఆ వెలితి అలా ఉండిపోయేది.  కానీ ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ను పరిచయం చేసే ప్రక్రియలో.. ఎలాంటి లోటు చేయకుండా YVS చౌదరి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీనిని బట్టి ప్రేక్షకులు ఏం కావాలనుకుంటున్నారో కూడా తెలుసుకునే వీలు ఉంటుంది.

ఈ దర్శకుడు ఇప్పటివరకు ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆ హీరోలందరిని కూడా ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆదరించారు. ఆ హీరోల సినిమాలకు బ్రహ్మ రథం పట్టారు. ఈ విధంగా తెరపై కనిపించే హీరోలతో పాటు.. తెర వెనుక నడిపించే ఈ దర్శకుడికి కూడా అభిమానులు పెరుగుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ ఎన్టీర్ వంతు వచ్చింది. ఈ హీరోకు అదే తరహాలో ఆదరణ లభిస్తుందని అంతా బలంగా నమ్ముతున్నారు. ఇండస్ట్రీలో తరం ఎలా మారుతూ వస్తుందో .. ప్రేక్షకులు సినిమాలను ఆదరించే తీరు కూడా మారుతూ వస్తుంది. ఇలాంటి సమయంలో YVS చౌదరి సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి తీరాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş