iDreamPost
android-app
ios-app

‘యాత్ర 2’ బిగ్ అప్డేట్! జీవా, మమ్ముట్టిల ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్!

  • Author ajaykrishna Updated - 12:17 PM, Mon - 9 October 23
  • Author ajaykrishna Updated - 12:17 PM, Mon - 9 October 23
‘యాత్ర 2’ బిగ్ అప్డేట్! జీవా, మమ్ముట్టిల ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్!

ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా 2019లో ‘యాత్ర’ అనే మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళం స్టార్ మమ్ముట్టి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించారు. సినిమాని దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద యాత్ర సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘యాత్ర 2’ అనౌన్స్ చేశాడు దర్శకుడు మహి వి రాఘవ్. ఈ సీక్వెల్ ని ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరపైకి తీసుకొస్తున్నారు. సీఎం జగన్ క్యారెక్టర్ లో తమిళ హీరో జీవా నటిస్తున్నారు.

ఇప్పటికే యాత్ర 2 అనౌన్స్ మెంట్ వీడియోతో సీక్వెల్ పై ఫుల్ హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు. ముందుగా చెప్పినట్లే ఈ యాత్ర 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడగానే సినిమాపై ఆసక్తి రెట్టింపు అయిపోయిందని చెప్పాలి. ఒకే ఫ్రేమ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాత్రలో జీవా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లుక్ లో మమ్ముట్టి ఇంటెన్స్ లుక్స్.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలిగిస్తున్నాయి. ఈ ఇంటరెస్టింగ్ పోస్టర్ లో.. “నేనెవ‌రో ఈ ప్ర‌పంచానికి ఇంకా తెలియ‌కపోవ‌చ్చు. కానీ ఒక్క‌టి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కొడుకుని” అంటూ సీఎం జగన్ పాత్రను ఎలివేట్ చేసిన తీరు బాగుంది.

ఫస్ట్ లుక్ తో పాటు సీఎం జగన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గురించి రాసిన ఆ స్టేట్మెంట్.. జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేగాక యాత్ర 2 సినిమా రిలీజ్ డేట్ కూడా రివీల్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది.. అంటే 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి దశతో పాటు జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ జర్నీ ఆరంభంతో సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. ఇక పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యూలాయిడ్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మరి యాత్ర 2 ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş