Ravi Teja: స్టార్ క్రికెటర్ బయోపిక్ పై రవితేజ ఇంటరెస్ట్! ఎవరిదో తెలుసా?

స్టార్ క్రికెటర్ బయోపిక్ పై రవితేజ ఇంటరెస్ట్! ఎవరిదో తెలుసా?

  • Author ajaykrishna Published - 10:35 AM, Mon - 9 October 23
  • Author ajaykrishna Published - 10:35 AM, Mon - 9 October 23
స్టార్ క్రికెటర్ బయోపిక్ పై రవితేజ ఇంటరెస్ట్! ఎవరిదో తెలుసా?

లైఫ్ లో ప్రతీ ఒక్కరూ ఎప్పటికప్పుడు ఎవరో ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. చిన్నప్పుడు అనే కాదు.. పెరుగుతున్నకొద్దీ.. ప్రతీ మూమెంట్ లో ఎవరో ఒకరు మనకు ఆదర్శంగా నిలుస్తుంటారు. అలా ఇన్స్పిరేషన్ ఇచ్చే వారిలో మనకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉండొచ్చు.. చిన్నవాళ్లు కూడా ఉండొచ్చు. అయితే.. సాధారణంగా ఎవరికి వారు ఒక్కొక్కరిని చూసి ఇన్స్పిరేషన్ పొందడం వేరు. సినిమా స్టార్స్ విషయానికి వస్తే.. ఫ్యాన్స్ లో ఏర్పడే ఆసక్తి వేరుగా ఉంటుంది. సినిమాకు అనగానే ఈ మధ్య బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన పర్సనాలిటీస్ జీవితాల ఆధారంగా బయోపిక్స్ తీస్తున్నారు.

ఈ క్రమంలో కొందరు స్టార్స్.. తామే ఫలానా వ్యక్తి బయోపిక్ లో నటించాలని ఉందంటూ తమ కోరికలను బయట పెట్టేస్తున్నారు. తాజాగా మాస్ రాజా రవితేజ ఒక స్టార్ బయోపిక్ లో నటించాలని ఉందంటూ చెప్పేశాడు. ప్రస్తుతం రవితేజ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ కి రెడీ అవుతోంది. దసరా సందర్బంగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అవుతుండగా.. సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. కాగా.. ఇటీవల విడుదలైన మూవీ ట్రైలర్ కూడా ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు చేసేసింది.

ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. రవితేజ తాజాగా జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ కి కాసేపు కామెంటరీ చెప్పి అలరించాడు. కామెంటరీలో క్రికెట్ పై తనకున్న అభిమానం.. అనుభవాలు పంచుకున్నాడు. పైగా తనకు క్రికెటర్ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే మాత్రం.. ఖచ్చితంగా మహమ్మద్ సిరాజ్ బయోపిక్ లో నటిస్తానని తేల్చి చెప్పేశాడు రవితేజ. అలాగే తనకు విరాట్ కోహ్లీ యాటిట్యూడ్, బ్యాటింగ్ విధానం చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రవితేజ బయోపిక్ పై చూపిన ఇంటరెస్ట్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసింది. మరి మాస్ రాజా మహమ్మద్ సిరాజ్ బయోపిక్ లో నటిస్తే ఎలా ఉంటుందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments