iDreamPost
android-app
ios-app

వీడియో: లోపలికి చొరబడి మరీ మహిళా సిబ్బందిని చితక్కొట్టింది!

  • Published Jul 18, 2023 | 1:28 PM Updated Updated Jul 18, 2023 | 1:28 PM
  • Published Jul 18, 2023 | 1:28 PMUpdated Jul 18, 2023 | 1:28 PM
వీడియో: లోపలికి చొరబడి మరీ మహిళా సిబ్బందిని చితక్కొట్టింది!

మనుషులు ఈ మధ్య కాలంలో హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకే ఎదుటి వ్యక్తులపై దాడులకు పాల్పడుతున్నారు. ఆ అవతలి వారు ఎవరన్న విచక్షణ లేకుండా రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ మహిళ టోల్‌ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడింది. టోల్‌ ప్లాజా గదిలోకి ప్రవేశించి మరీ సిబ్బందిని చావ గొట్టింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ మహిళ కారులో ప్రయాణిస్తూ ఉంది.

ఆ కారు లోహర్లి టోల్‌ ప్లాజా దగ్గరకు వచ్చింది. అక్కడి మహిళా సిబ్బందికి.. ఈ మహిళకు ఏదో విషయంలో గొడవ మొదలైంది. ఆ గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. కొద్దిసేపటి తర్వాత కారులోని మహిళ టోల్‌ ప్లాజా సిబ్బంది ఉండే గదిలోకి చొచ్చుకుని వచ్చింది. ఆమెతో మరోసారి గొడవ పెట్టుకుంది. అనంతరం మహిళా సిబ్బంది జుట్టు పట్టుకుంది. తర్వాత ఆమెను పైకి ఎత్తి కిందపడేసింది. అక్కడున్న వాళ్లు ఆమెను పక్కకు తీసుకెళ్లిపోయారు. డాద్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, టోల్‌ ప్లాజా మహిళా సిబ్బందిపై దాడికి పాల్పడ్డ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఆ టోల్‌ ప్లాజా వాళ్లు ఎక్కువ డబ్బులు వసూళు చేస్తున్నారు. అలా బుద్ధి చెబితేనే మంచిది’’ అంటూ కామెం‍ట్లు చేస్తున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetvbettr girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş