iDreamPost
android-app
ios-app

ఆ రెండు తప్ప.. మిగతావన్నీ బజ్ లేనివే! పోటీకి ఎలా?

  • Author ajaykrishna Published - 02:35 PM, Thu - 5 October 23
  • Author ajaykrishna Published - 02:35 PM, Thu - 5 October 23
ఆ రెండు తప్ప.. మిగతావన్నీ బజ్ లేనివే! పోటీకి ఎలా?

శుక్రవారం వస్తుందంటే చాలు.. సినీ ప్రేక్షకులలో, సినిమా హీరోల ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం కనిపిస్తుంది. ప్రతీ వారం కూడా ఈరోజు కోసమే ఎదురు చూస్తుంటారు. అందుకు కారణం.. కొత్త సినిమాల రిలీజులు. అవును.. థియేటర్స్ లోకి కొత్త సినిమాలు వస్తుంటే.. ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది. అయితే.. ఏమేం సినిమాలు వస్తున్నాయి అనేది అసలు పాయింట్. ముందుగా స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయా? అని చూస్తారు. లేదు.. స్టార్ హీరోలవి లేవు అని తెలిస్తే.. నెక్స్ట్ మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఏవేవి వస్తున్నాయని చెక్ చేస్తారు. సరే అవి కూడా లేవు. చిన్న సినిమాలు ఉన్నాయి. అనుకుంటే.. వాటిలో బజ్ దేనికి ఉంది? అనేది చూస్తుంటారు.

కొత్త సినిమాలు రిలీజ్ అంటే.. ఎలాగైనా సినిమాల బజ్ బట్టి ఫ్యాన్స్ లో ఇంటరెస్ట్ కలుగుతుంది. ఆ ఇంటరెస్ట్ కలగడానికి సినిమాల ట్రైలర్స్, సాంగ్స్, ప్రమోషన్స్ కూడా భాగం అవుతాయి. కానీ.. ఎలాంటి బజ్ లేకుండా రిలీజ్ అయితే మాత్రం ఎవరి సినిమా అయినా జనాలు పెద్దగా ఆసక్తి చూపించరు. ఎందుకంటే.. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడం అనేది అంత ముఖ్యం. సినిమా స్టఫ్ బాగుంటే ఎవరైనా పక్కవాళ్ళకు సజెస్ట్ చేసి మరి సినిమాలకు వెళ్తుంటారు. కానీ.. సినిమాలకు ఎలాంటి బజ్ లేకుండా వస్తే.. మంచి సినిమాకైనా మార్కెట్ ఉండదు. కలెక్షన్స్ అంతకన్నా రావు అనేది నిజం. ప్రస్తుతం అక్టోబర్ 6న వస్తున్న సినిమాల పరిస్థితి అలాగే ఉంది.

అన్ని సినిమాలవి కాదు. ఉన్నవాటిలో మూడు నాలుగు సినిమాలకు మినిమమ్ బజ్ అయితే ఉంది. అది సినిమాలో కంటెంట్ బట్టి కంటిన్యూ అవుతుంది. సాంగ్స్, ట్రైలర్ లతో ఎలాంటి బజ్ క్రియేట్ చేసినా.. సినిమాలో దమ్ము ఉండాలి. ప్రస్తుతం రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాలు దాదాపు పది ఉన్నాయి. వాటిలో డబ్బింగ్ సినిమాలు పక్కన పెడితే.. దాదాపు ఆరు సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. వాటిలో బజ్ కాస్తో కూస్తో ఉందంటే.. రూల్స్ రంజన్, మ్యాడ్, మంత్ ఆఫ్ మధు సినిమాలకు వినిపిస్తుంది. ఇక బజ్ లేకుండా వస్తున్న సినిమాలు ఏవంటే.. మామా మశ్చింద్ర, చిన్నా, ఏందిరా ఈ పంచాయతీ, 800 మూవీస్. మరి ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అంటే థియేటర్స్ దొరకడం చాలా కష్టం. అందులోనూ బజ్ కూడా లేకపోతే ఎలా అనేది.. ఫలితం బట్టి అర్ధమవుతుంది. మరి ఈ సినిమాలలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్స్ లో తెలపండి.