iDreamPost
android-app
ios-app

KGF 2కి సలార్ కనెక్షన్

  • Published Apr 16, 2022 | 4:03 PM Updated Updated Apr 16, 2022 | 4:04 PM
  • Published Apr 16, 2022 | 4:03 PMUpdated Apr 16, 2022 | 4:04 PM
KGF 2కి సలార్ కనెక్షన్

అదేంటి కెజిఎఫ్ 2కి ప్రభాస్ సలార్ కి కనెక్షన్ ఏంటనే డౌట్ వస్తోందా. అక్కడికే వద్దాం. కెజిఎఫ్ చాప్టర్ 2లో ఫర్మాన్ అనే పాత్ర ఉంటుంది. గోల్డ్ మైన్స్ లో పని చేస్తూ రాఖీ భాయ్ మీద అపారమైన అభిమానం కలిగి ఉండే క్యారెక్టర్ ఇది. దీన్ని పోషించిన నటుడి పేరు శరణ్ శక్తి. 2013లో మణిరత్నం కడలి ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై ఇటీవలే కొంచెం పెద్ద వేషాలు దక్కించుకుంటున్నాడు.

కెజిఎఫ్ 2లో ఇతని తల్లిగా ఈశ్వరి రావు నటించారు. ఫస్ట్ హాఫ్ లోనే ఈ ఇద్దరికి మంచి కాంబినేషన్ సీన్లు పడ్డాయి. ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యారు. ఇక అసలు విషయానికి వద్దాం. కెజిఎఫ్ 2 కథలో భాగంగా మెయిన్ విలన్ అధీరా రూపంలో వచ్చే సంజయ్ దత్ ని మొదట ఫేస్ చేసింది ఫర్మానే. కాకపోతే అతని డెడ్ బాడీని మనకు నేరుగా చూపించరు. రాఖీ భాయ్ మోసుకొస్తాడు కానీ ముఖం కనిపించదు.

ఇప్పుడు సలార్ లో ప్రభాస్ పోషించింది ఈ ఫర్మాన్ పాత్రేనని బెంగళూరు టాక్. ఆధారాలున్నాయి. ఇద్దరి మెడలో ఒకే టైపు లాకెట్ ని కెజిఎఫ్ సినిమాలో సలార్ పోస్టర్ లో చూడొచ్చు. ఇందులో డార్లింగ్ తల్లిగా చేసింది ఈశ్వరి రావే. సో ఇలా ముడిపెట్టుకుని చూస్తే రాఖీ భాయ్ దగ్గర పనిచేసిన ఫర్మానే తర్వాత కాలంలో పవర్ ఫుల్ డాన్ సలార్ గా మారతాడన్న మాట. నిజమో కాదో వెయిట్ చేసి చూద్దాం

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş