iDreamPost
android-app
ios-app

చిన్న సినిమాతో మాస్ రాజా ట్రాక్ ఎక్కుతాడా..?

  • Author ajaykrishna Updated - 11:21 AM, Fri - 15 September 23
  • Author ajaykrishna Updated - 11:21 AM, Fri - 15 September 23
చిన్న సినిమాతో మాస్ రాజా ట్రాక్ ఎక్కుతాడా..?

ఇండస్ట్రీలో అభిమాన హీరోలు ఎప్పుడూ సక్సెస్ లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అభిమానులు. అలా కాకుండా హీరోలకు ప్లాప్స్ ఎదురయ్యాయి అనంటే.. చాలా ఫీల్ అయిపోతుంటారు. మళ్లీ ఎప్పుడెప్పుడు హిట్టు కొట్టి ఫామ్ లోకి వస్తారా? అని వెయిట్ చేస్తుంటారు. ప్రస్తుతం మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్ అలాంటి వెయిటింగ్ లోనే ఉన్నారు. అదేంటి.. రవితేజ ఆల్రెడీ ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టేసి.. ఫామ్ లోకి వచ్చాడు కదా! అని డౌట్ రావచ్చు. కానీ.. ఇక్కడ విషయం రవితేజ హీరోగా ధమాకా సక్సెస్ గురించి కాదు. హీరోగా చేస్తూనే.. ఓవైపు నిర్మాణంలో అడుగు పెట్టేసాడు కదా! దాని గురించి అన్నమాట.

రవితేజ హీరోగా చేస్తూ కూడా ఈ మధ్య కొన్ని సినిమాలు నిర్మిస్తున్నాడు. హీరోగా ఒక హిట్ వచ్చినా.. ఆ తర్వాత మూడు నాలుగు ప్లాప్స్ ఇవ్వడం మాస్ రాజాకు మామూలే అయిపోయింది. కానీ.. ఎప్పుడు కుంగిపోలేదు. ఇంకా రవితేజ పని అయిపోయింది అనుకున్న ప్రతీసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నిర్మాతగా ఆయన జర్నీ ఎలా ఉండబోతుంది? అనేది అసలు విషయం. రవితేజ నిర్మాతగా మారి మట్టికుస్తీ అనే మూవీ నిర్మించాడు. ఆ సినిమా బాగుందని టాక్ వచ్చేలోపు థియేటర్స్ నుండి వెళ్లిపోయింది. అలాగే తాను హీరోగా చేసిన రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నష్టాలు చవిచూసాయి.

దీంతో ఇప్పుడు అందరి దృష్టి రవితేజ కొత్తగా నిర్మించిన ‘చాంగురే బంగారు రాజా’ సినిమాపై పడింది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కి రెడీ అయ్యింది. మరి ఈ సినిమాతో అయినా రవితేజ.. నిర్మాతగా ఫస్ట్ బోణి కొడతాడేమో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే.. ఆయన నుండి నిర్మాతగా మరికొన్ని మంచి సినిమాలు ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. సో.. ఇదే సినిమా అని కాదు. సుందరం మాస్టర్ అనే మరో సినిమా కూడా రవితేజ నిర్మిస్తున్నారు. మరి హీరోగా గ్యాప్ ఇచ్చినా సక్సెస్ కొట్టే మాస్ రాజా.. ఈసారైనా నిర్మాతగా నిలబడగలడా లేదా చూడాలి. మరి రవితేజ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler