Swetha
Little Hearts Movie : ఈ మధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు అనుకోని సక్సెస్ ను అందుకుంటున్నాయి. దీనిని బట్టే అర్థంచేసుకోవచ్చు ప్రేక్షకులు సినిమాలను ఆదరించడానికి ఎప్పుడు రెడీగానే ఉంటున్నారు. వాళ్ళను మెప్పించే కథలు రావడమే ఆలస్యం.
Little Hearts Movie : ఈ మధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు అనుకోని సక్సెస్ ను అందుకుంటున్నాయి. దీనిని బట్టే అర్థంచేసుకోవచ్చు ప్రేక్షకులు సినిమాలను ఆదరించడానికి ఎప్పుడు రెడీగానే ఉంటున్నారు. వాళ్ళను మెప్పించే కథలు రావడమే ఆలస్యం.
Swetha
ఈ మధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు అనుకోని సక్సెస్ ను అందుకుంటున్నాయి. దీనిని బట్టే అర్థంచేసుకోవచ్చు ప్రేక్షకులు సినిమాలను ఆదరించడానికి ఎప్పుడు రెడీగానే ఉంటున్నారు. వాళ్ళను మెప్పించే కథలు రావడమే ఆలస్యం. ఈ క్రమంలో ఇప్పుడు మరో చిన్న సినిమా థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. సినిమా ట్రైలర్ చూసి చెప్పేయొచ్చు కథలో కంటెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గానే ఉందని.
అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీని కూడా సినిమా ఎంటర్టైన్ చేయడం అయితే పక్కా. సినిమాలు స్టార్స్ లేరు కానీ.. ఆ రేంజ్ ఎంటర్టైన్మెంట్ అందించే క్యాస్టింగ్ అయితే ఉన్నారు. ఓటిటి లో వచ్చిన 90’స్ మిడిల్ క్లాస్ మూవీతో పాపులర్ అయినా మౌళి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అదే సినిమా దర్శకుడు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం విశేషం. ఈ సినిమాతో సాయి మార్తాండ్ అనే ఓ న్యూ డైరెక్టర్ ఎంట్రీ ఇస్తున్నాడు. ట్రైలర్ ను గమనిస్తే ప్రేక్షకులను శాటిస్ఫై చేసేలానే ఉంది.
ముఖ్యంగా ఏ సినిమాలో అయినా హీరో డల్ స్టూడెంట్ గా ఉంటే హీరోయిన్ టాపర్ గా చూపిస్తారు. కానీ ఇందులో మాత్రం ఇద్దరు డల్ స్టూడెంట్స్ గానే పరిచయం అవుతారు. ఈ టీనేజ్ డల్ స్టూడెంట్స్ మధ్య జరిగే ప్రేమాయణం ఈ సినిమా. ఇక రాజీవ్ కనకాల సినిమాకు హైలెట్. ఒక్కసారి పాజిటివ్ టాక్ వస్తే కనుక ఇక మిగతాది ప్రమోషన్స్ సోషల్ మీడియా చూసుకుంటుంది. థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ ఓటిటి లో కి వచ్చిన తర్వాత మాత్రం ట్రెండింగ్మ్ లోకి వెళ్లడం ఖాయం. ఇక ఏమి జరుగుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.