iDreamPost
android-app
ios-app

అమిత్ షా పర్యటనలో ఆసక్తికర సీన్.. ప్రభాస్, రాజమౌళితో భేటీ?

  • Published Jun 13, 2023 | 6:59 PM Updated Updated Jun 13, 2023 | 6:59 PM
  • Published Jun 13, 2023 | 6:59 PMUpdated Jun 13, 2023 | 6:59 PM
అమిత్ షా పర్యటనలో ఆసక్తికర సీన్.. ప్రభాస్, రాజమౌళితో భేటీ?

మరి కొన్ని నెలల్లో తెలంగాణాలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేరికలతో బిజీగా ఉంటే.. బీజేపీ పార్టీ మాత్రం అందుకు భిన్నంగా పావులు కదుపుతుంది. వేరే పార్టీల నుంచి నేతలను తమ పార్టీ లోకి ఆకర్షించడమే కాక .. ఓటర్లను ఆకట్టుకునేందుకు వేరువేరు రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ అవుతూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరేకెత్తిస్తోంది. దీనిలో భాగంగానే త్వరలో మరో ఆసక్తికర భేటీకి రంగం సిద్ధం చేస్తుంది కాషాయ పార్టీ. ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్టార్స్ తో భేటీ కానున్నారు బీజేపీ అగ్ర నేత అమిత్ షా. ఆ వివరాలు..

త్వరలోనే బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. హైదరాబాద్ రానున్నారు. ఈసారి అమిత్ షా పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకోనుంది. త్వరలో హైదరాబాద్ రానున్న అమిత్ షా తన పర్యటనలో భాగంగా ఆస్కార్ విజేత, పాన్ ఇండియా దర్శకుడు రాజమౌళితో పాటు పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారనే విషయం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరో రెండు రోజుల్లో అనగా జూన్ 15న ఖమ్మంలో బీజేపీ ఆధ్వరంలో ఓ సభ జరగనుంది. దీనికోసం అమిత్ షా.. తెలంగాణకి రాబోతున్నారు. అయితే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ లో ల్యాండ్ అవుతారని తెలుస్తోంది. సంపర్క్ సే సమర్ధన్ కార్యక్రమంలో భాగంగా నోవాటెల్ లో రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరితోపాటు మరో ఇద్దరు ప్రముఖుల్ని కూడా అమిత్ షా కలవనున్నారట. అయితే ఇప్పటి ఈ భేటీ గురించి ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

త్వరలోనే ఎన్నికలు రాబోతున్న నేపధ్యం లో అమిత్ షా.. రాష్ట్రాల పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో అమిత్‌ షా భేటీ అవుతున్నారు. దీనిలో భాగంగా.. గతంలో హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన అమిత్‌ షా.. టాలీవుడ్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌, నితిన్‌తో పాటు మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌తో పాటు ఇతర ప్రముఖులను కలిసిన సంగతి తెలిసిందే.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap