Tirupathi Rao
Complaint On National Award Winning Director: జాతీయ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Complaint On National Award Winning Director: జాతీయ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Tirupathi Rao
జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ డైరెక్టర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. కట్టుకున్న భార్య అతనిపై ఘోరమైన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అతను మరెవరో కాదు.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన మన్సోరాయ్. ఈయన కన్నడలో తనదైనశైలిలో చిత్రాలు నిర్మిస్తూ నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ఆయన పెద్ద చిక్కుల్లో పడ్డారు. ఆయన సతీమణి అఖిల పోలీసులను ఆశ్రయించింది. తన భర్త తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం కూడా వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో ఈ కేసు సంచలనంగా మారింది.
ఈ స్టార్ డైరెక్టర్ మన్సోరాయ్ భార్య అఖిల సుబ్రహ్మణ్యపుర పోలీస్ స్టేషన్ లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. కోవిడ్ సమయంలో తన భర్త మన్సోర్ ఒక సినిమా తీశారు. అందుకు గానూ తన కుటుంబం వద్ద రూ.10 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే రూ.30 లక్షలు విలువజేసే ఎస్యూవీ కారును ఇవ్వాలంటూ తన అత్త వెంకటలక్ష్మమ్మ, వదిన హేమలత తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ తెలియజేసింది. ఇప్పటికీ తనని అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఆరోపించింది. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారంటూ పోలీసులకు చేసిన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొంది. అయితే మన్సోర్ మాత్రం తన భార్య ఆరోపణలను కొట్టి పారేస్తున్నాడు. తన భార్య మెంటల్ హెల్త్ సరిగ్గా లేదంటూ చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్ని పోలీసులకు లేఖ రూపంలో తెలియజేశాడు.
ఆ లేఖలో ఏ ముందంటే.. “నేను ప్రస్తుతం నా లైఫ్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అందుకు కారణం నా భార్య అఖిల మానసిక ఆరోగ్యమే. నేను నా భార్య మెంటల్ హెల్త్ విషయంలో చాలా రోజులుగా సతమతమవుతున్నాను. నేను బెంగళూరులోని ఒక కౌన్సిలింగ్ సెంటర్ కి కూడా తీసుకెళ్లాను. ఆమెలో ఎలాంటి మార్పు నాకు కనిపించలేదు. అంతేకాకుండా ఆమెకు థెరపీ అవసరమంటూ వైద్యులు సూచించారు. నేను నా పెళ్లికి గానీ, ఆ తర్వాత గానీ అఖిల కుటుంబం నుంచి ఎలాంటి కట్నం తీసుకోలేదు. వారి నుంచి నాకు ఎలాంటి డబ్బు, నగలు, కారు ఏం అందలేదు. మీకు అనుమానం ఉంటే మీరు నా బ్యాంకు ఖాతాను కూడా చెక్ చేసుకోవచ్చు.
ఆమె మాతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి పోయింది. పోతూ పోతూ తనతో పాటుగా ఇంట్లో ఉన్న నగలతో పాటుగా నా నేషనల్ అవార్డుని కూడా తీసుకుపోయింది. మిగిలిన మెడల్స్ ని కూడా తనతో తీసుకెళ్లింది. మీరు నా భార్య చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవద్దు. వరకట్న వేధింపులు, దళిత యువతిపై హింస వంటి ఆరోపణలను పరిగణలోకి తీసుకోకండి” అంటూ మన్సోర్ పోలీసులకు లేఖ రూపంలో విజ్ఞప్తి చేశాడు. మన్సోర్- అఖిలకు 2021లో వివాహం జరిగింది. అయితే వీరికి పెళ్లి జరిగిన కొన్ని రోజుల నుంచే గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే డైరెక్టర్ భార్య ఫిర్యాదు విషయంలో పోలీసులు ఏం చేస్తారు? మన్సోర్ పై కేసు నమోదు చేస్తారా లేదా? నిజంగానే అఖిలకు మెంటల్ హెల్త్ సరిగ్గా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి.. డైరెక్టర్ పై భార్య ఆరోపణలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.