iDreamPost
android-app
ios-app

Thalapathy Vijay: ఆ విషయంలో దళపతి మారాలి.. లేకుంటే తెలుగు మార్కెట్ వదులుకోవాల్సిందే!

  • Published Sep 03, 2024 | 7:05 PM Updated Updated Sep 03, 2024 | 7:05 PM

The Goat Movie, Thalapathy Vijay: ఆ విషయంలో దళపతి విజయ్ మారాలని, లేకుంటే తెలుగు మార్కెట్ పై ఆశలు వదిలిపెట్టుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

The Goat Movie, Thalapathy Vijay: ఆ విషయంలో దళపతి విజయ్ మారాలని, లేకుంటే తెలుగు మార్కెట్ పై ఆశలు వదిలిపెట్టుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Sep 03, 2024 | 7:05 PMUpdated Sep 03, 2024 | 7:05 PM
Thalapathy Vijay: ఆ విషయంలో దళపతి మారాలి.. లేకుంటే తెలుగు మార్కెట్ వదులుకోవాల్సిందే!

తెలుగు హీరోలకు తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అలాగే కోలీవుడ్ హీరోలకు ఇక్కడ గొప్ప మార్కెట్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దళపతి విజయ్, కార్తీ లతో పాటుగా మరికొందరి సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. వారికి ఇక్కడ హార్ట్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో దళపతి విజయ్ ఆ విషయంలో మారాలి అంటూ ఫ్యాన్స్ సూచిస్తున్నారు.

దళపతి విజయ్.. తమిళంలో అగ్ర హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు. విజయ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక తెలుగులో కూడా విజయ్ కు మంచి మార్కెటే ఉంది. ఆయన సినిమాలు అన్నీ కూడా తెలుగులో రిలీజ్ అవుతాయి. అయితే విజయ్ కి మాత్రం ఇక్కడి మార్కెట్ పై అంత ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనిపించడం లేదు. తన సినిమాలు రిలీజ్ అవుతుంటే.. తెలుగులో కనీసం ప్రెస్ మీట్ కు కూడా అటెండ్ కాడు. ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరగవు.. జరిగినా కూడా విజయ్ రాడు. ఈ విషయంలో దళపతి మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేకపోతే తెలుగు మార్కెట్ ను వదిలేసుకోవాల్సి వస్తుందని ఫీల్ అవుతున్నారు.

ఇతర భాషల హీరోల సినిమాల తెలుగులో రిలీజ్ అవుతుంటే.. ఆ హీరోలు వచ్చి ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. తాజాగా తంగలాన్ ప్రమోషన్స్ లో విక్రమ్ టాలీవుడ్ లో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇప్పుడు సక్సెస్ మీట్స్ లో కూడా పాల్గొంటున్నాడు. కానీ దళపతి విజయ్ విషయానికి వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంది. విజయ్ తన మూవీస్ తెలుగులో రిలీజ్ అవుతున్నా వాటిని పెద్దగా పట్టించుకోడు, ప్రెస్ మీట్స్, ప్రమోషన్స్ కు రాడు. దాంతో ఈ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కాకుండా.. కాస్త మారి తెలుగులో ప్రమోషన్స్ చేస్తే సినిమాకు భారీ కలెక్షన్లు వస్తాయన్నది వారి ఆశ.

గతంలో ‘లియో’ అప్పుడు లోకేశ్ కనగరాజ్ కారణంగా మంచి బజ్ వచ్చింది. ఆ తర్వాత ‘వారసుడు’కి దిల్ రాజు ప్రొడక్షన్ పెద్దదిక్కుగా మారింది. ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో వస్తున్న ‘ది గోట్’ విషయంలో కూడా విజయ్ ఇలాగే చేశాడు. అయితే.. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ రిలీజ్ చేస్తుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ వస్తాడని అందరూ భావించారు. కానీ ఎప్పటిలాగే అది జరగలేదు. నెక్ట్స్ మూవీకైనా విజయ్ టాలీవుడ్ ప్రమోషన్స్ కి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ది గోట్ మూవీ సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. మరి విజయ్ టాలీవుడ్ లో ప్రమోషన్స్ కు రాకపోవడానికి కారణం ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss