iDreamPost
android-app
ios-app

వాళ్లలో తెలుగు సినిమాలపై ఆసక్తి ఎక్కడుంది..?

  • Author ajaykrishna Published - 10:07 AM, Wed - 11 October 23
  • Author ajaykrishna Published - 10:07 AM, Wed - 11 October 23
వాళ్లలో తెలుగు సినిమాలపై ఆసక్తి ఎక్కడుంది..?

ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఫ్యాన్స్, ఆడియన్స్ లో ఎలాంటి సందడి కనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పండుగల సమయంలో హాలిడేస్ ఉంటాయి. సో.. అప్పుడు ఓవైపు సినిమా రిలీజులు.. మరోవైపు ఫెస్టివల్ వైబ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. ప్రస్తుతం దసరా పండుగ సందర్బంగా బాక్సాఫీస్ వద్ద మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి సినిమాలతో పాటు దళపతి విజయ్ నటించిన లియో కూడా రిలీజ్ అవుతోంది. వీటిలో టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ అవుతున్నాయి.

ఇక ఇప్పటికే ఈ మూడు సినిమాలకు సంబంధించి సాంగ్స్, ట్రైలర్స్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ సినిమాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంటుంది. ప్రతీసారి తమిళ డబ్బింగ్ సినిమాలను తెలుగు ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కనీసం రిలీజ్ ముందు ఆ హైప్ అయినా కనిపిస్తుంది. భగవంత్ కేసరి కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతోంది. సో.. పాన్ ఇండియా వైడ్ టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలకు పోటీ గట్టిగా ఉండబోతుంది. అయితే.. తెలుగులో లియో మూవీకి ఉన్న బజ్ తమిళంలో టైగర్ కి లేదనేది వాస్తవం.

తమిళం నుండి ఏ సినిమాలు వచ్చినా.. కంటెంట్ ఇంటరెస్టింగ్ గా ఉంటే.. ఖచ్చితంగా అక్కున చేర్చుకుంటారు తెలుగు జనాలు. ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. ఇంకా రెగ్యులర్ గా ఎలాంటి సినిమాలు వచ్చినా.. రెస్పాన్స్ చూస్తూనే ఉన్నాం. కానీ.. అనూహ్యంగా సాంగ్స్, ట్రైలర్ తో దేశవ్యాప్తంగా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు విషయంలో తమిళనాట జనాలు ఆసక్తి చూపించట్లేదని టాక్ వినిపిస్తుంది. తమిళ సినిమాలకు తెలుగులో దక్కుతున్న ఆదరణ పరంగా చూసుకుంటే.. తెలుగు సినిమాలను కూడా వాళ్ళు ఆదరించాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికైనా తెలుగు రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకొని తమిళ జనాలు టైగర్ ని ఆదరిస్తారేమో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.