iDreamPost
android-app
ios-app

Naveen Polishetty: సినిమాలకు దూరంగా నవీన్ పొలిశెట్టి! ఆ ఫోబియా కారణమా?

  • Published Jul 11, 2024 | 1:28 PM Updated Updated Jul 11, 2024 | 1:28 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో 'నవీన్ పొలిశెట్టి' గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇలా మూవీస్ కు దూరంగా ఉండటానికి అతడికి ఉన్న ఓ ఫోబియానే కారణమా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో 'నవీన్ పొలిశెట్టి' గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఇలా మూవీస్ కు దూరంగా ఉండటానికి అతడికి ఉన్న ఓ ఫోబియానే కారణమా? ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Naveen Polishetty: సినిమాలకు దూరంగా నవీన్ పొలిశెట్టి! ఆ ఫోబియా కారణమా?

యంగ్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకదాని తర్వాత ఇంకోటి మూవీ అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్నారు. ఇలా టాలీవుడ్ మెుతం బిజీ బిజీగా ఉంటే.. ఓ హీరో మాత్రం ఖాళీగా ఉన్నాడు. అలా అని అతడికి క్రేజ్ లేదనుకుంటే పొరపాటే. యూత్ లో అతడికి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. ఆ హీరో కామెడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉంది. నిర్మాణ సంస్థలు సైతం ఆ కుర్ర హీరో సై అంటే సినిమాలు తియ్యడానికి రెడీగా ఉన్నాయి. ఇన్ని ఉన్నాకూడా ప్రస్తుతం ఆ హీరో సినిమాలు చేయకుండా అమెరికాలో ఉన్నాడు. అతడే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ‘నవీన్ పొలిశెట్టి’. ఇతడు సినిమాలకు దూరంగా ఉండటానికి ఆ ఫోబియానే కారణమా? పూర్తి వివరాల్లోకి వెళితే..

నవీన్ పొలిశెట్టి.. టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకడు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ’ మూవీతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు కొన్ని సినిమాల్లో కనిపించాడు కూడా. ‘చిచోరే’ మూవీతో బాలీవుడ్ అరంగేట్రం కూడా చేశాడు. ఇక 2021లో కేవీ అనుదీప్ డైరెక్షన్ లో వచ్చిన ‘జాతిరత్నాలు’ మూవీతో ఓ రేంజ్ హిట్ కొట్టాడు. దాంతో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని సీనియర్ హీరోయిన్ అనుష్కతో ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం తర్వాత ఈ హీరో నుంచి మరో మూవీ అనౌన్స్ కాలేదు. దాంతో ఇతడికి ఏమైందని అభిమానులు ఆరా తీయడం మెుదలుపెట్టారు.

ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిసింది. నవీన్ పొలిశెట్టికి ఓ ఫోబియా ఉందని, దాని వల్లే అతడు సినిమాలకు దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ ఫోబియా ఏంటంటే? నవీన్ పొలిశెట్టికి ఫెయిల్యూర్ భయం ఉందట. కొడితే హిట్టు కొట్టాలి.. లేదంటే కెరీర్ ఫెయిల్యూర్ లో పడిపోతుందని భయమట. అందుకే సినిమాలను ఎంపిక చేసుకోవడంలో కాస్త తికమకపడుతున్నాడని తెలుస్తోంది. మంచి స్టోరీ తన దగ్గరికి వచ్చినా.. ఇంకా మంచి స్క్రిప్ట్ అయితే బాగుంటుంది అంటూ సినిమాలను సెలెక్ట్ చేసుకోవడంలేదట. కాగా.. ప్రస్తుతం నవీన్ సితారా సంస్థలో ఓ సినిమా చేయాలి. అనుదీప్ తో కథ చెప్పించినా అతడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట, మరో ఇద్దరు దర్శకులు సైతం నవీన్ పొలిశెట్టికి కథలు చెప్పినా అవి వర్కౌట్ అవ్వలేదని టాక్. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇండియాకు వచ్చి.. ఆ ఫోబియాను వదిలి రిస్క్ చేసి మూవీస్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet