iDreamPost
android-app
ios-app

Kiran Abbavaram: నిన్ననే టైటిల్ రివీల్.. అప్పుడే హక్కుల కోసం భారీ పోటీ!

  • Published Jul 11, 2024 | 12:22 PM Updated Updated Jul 11, 2024 | 12:22 PM

టైటిల్ రివీల్ చేసి 24 గంటలు గడవకముందే.. ఓ సినిమా పంపిణీ హక్కులను దక్కించుకునేందుకు భారీ పోటీ నెలకొంది. రెండు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఆ సినిమా రైట్స్ ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

టైటిల్ రివీల్ చేసి 24 గంటలు గడవకముందే.. ఓ సినిమా పంపిణీ హక్కులను దక్కించుకునేందుకు భారీ పోటీ నెలకొంది. రెండు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఆ సినిమా రైట్స్ ను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 11, 2024 | 12:22 PMUpdated Jul 11, 2024 | 12:22 PM
Kiran Abbavaram: నిన్ననే టైటిల్ రివీల్.. అప్పుడే హక్కుల కోసం భారీ పోటీ!

సాధారణంగా ఓ మూవీ టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత రైట్స్ కోసం డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడతాయి. అయితే కొన్ని సినిమా విషయంలో ఇందుకు రివర్స్ గా జరుగుతూ ఉంటుంది. సినిమా అనౌన్స్ చేయగానే ఆ డైరెక్టర్ పై, ఆ హీరోపై ఉన్న నమ్మకంతో హక్కులను దక్కించుకునేందుకు ముందుకు వస్తాయి డిస్ట్రిబ్యూషన్ సంస్థలు. ఇక టైటిల్ రివీల్ చేసి 24 గంటలు గడవకముందే.. ఓ సినిమా పంపిణీ హక్కులను దక్కించుకునేందుకు భారీ పోటీ ఏర్పడుతోంది. ఇంతకీ ఆ మూవీ ఏదంటే? ‘క’. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం. ఆ వివరాల్లోకి వెళితే..

కిరణ్ అబ్బవరం.. పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతుంది. పైగా ఏడాదికి రెండు, మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు కూడా. కానీ సరైన హిట్ లేదు. ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ మూవీ ఒక్కటే అతడి కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్ సినిమా. ఆ తర్వాత చాలా సినిమాలే చేశాడు కానీ.. సక్సెస్ మాత్రం సాధించలేకపోయాడు. కానీ పట్టుదలను మాత్రం వదలకుండా వరుసగా మూవీలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా సుజిత్-సందీప్ అనే ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ.. తానే హీరోగా నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం ‘క’. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని కిరణ్ తెరకెక్కిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నాడు. ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో ఉన్నాడు ఈ యంగ్ హీరో.

కాగా..’క’ చిత్ర ట్రైలర్ కార్యక్రమాన్ని AAA మల్టీప్లెక్స్ లో ఈనెల 14న నిర్వహించనున్నారు. అయితే ఇప్పటి ఈ ట్రైలర్ ను చూసిన కొందరు సినీ ప్రముఖులు విరూపాక్ష టైప్ మిస్టరీ థ్రిల్లర్ గా ఉందని పేర్కొంటున్నారు. దాంతో థియేట్రికల్ బిజినెస్ కోసం భారీ పోటీ నెలకొంటుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకొంటున్నాయి. రెండు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు రైట్స్ కోసం పోటీపడుతున్నట్లు టాక్. ఇక తన మార్కెట్ కు మించిన బడ్జెట్ తో కిరణ్ అబ్బవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom