iDreamPost
android-app
ios-app

హ్యాట్రిక్ హీరో.. అసలు మూడో సినిమా ఇదే కదా! ఏమైనట్టు?

  • Author ajaykrishna Updated - 09:44 AM, Sat - 23 September 23
  • Author ajaykrishna Updated - 09:44 AM, Sat - 23 September 23
హ్యాట్రిక్ హీరో.. అసలు మూడో సినిమా ఇదే కదా! ఏమైనట్టు?

ఇండస్ట్రీలో హీరోలు వరుసగా సినిమాలు ఓకే చేసినప్పుడు.. ఒకదాని వెనుక ఒకటి రిలీజ్ అవ్వడం మామూలే. కానీ.. అప్పుడప్పుడు అనుకున్న దానికంటే ముందు వేరే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఎప్పుడో అనౌన్స్ మెంట్ అయిన సినిమా కాకుండా.. దాని తర్వాత మొదలైన సినిమా రిలీజ్ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సరే.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనుకుందాం. మరి.. ముందు మొదలైన సినిమా ఏమైందనే సందేహం రాకమానదుగా.. ప్రస్తుతం హీరో నవీన్ పొలిశెట్టి సినిమాల విషయంలో అదే వినిపిస్తుంది. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ.. జాతిరత్నాలు.. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నవీన్.

కట్ చేస్తే.. ఏజెంట్ ఆత్రేయ, జాతిరత్నాలు తర్వాత చాలా గ్రాండ్ గా ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఆ సినిమా నిర్మాతలు. కాగా.. అప్పటికి జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ కావడంతో మూడో సినిమాగా అనగనగా ఒక రాజు అనౌన్స్ చేశాడు నవీన్. అదికూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ తోనే ప్లాన్ చేశారని అనౌన్స్ మెంట్ వీడియో చూస్తే అర్ధమవుతుంది. మొత్తానికి నవీన్ నుండి మరో కామెడీ మూవీ కన్ఫర్మ్ అని అందరు అనుకున్నారు. డెబ్యూ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనుండగా.. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అయిపోయాడు. కానీ.. అది అనౌన్స్ మెంట్ వరకే అనగనగా ఒక రాజు వైబ్ ఆగిపోయింది.

ఏమైందో తెలియదు.. అసలు ప్రాజెక్ట్ ఉందో లేదో కూడా సమాచారం లేదు. అది నవీన్ నుండి రావాల్సిన మూడో సినిమా. కానీ.. అనూహ్యంగా ఆ సినిమా సౌండ్ ఆగిపోయి.. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తెరపైకి వచ్చింది. సరే దానితో పాటు ఇదికూడా షూట్ చేస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ.. రాజు కథ కదలట్లేదని.. మిస్టర్ పొలిశెట్టి థియేటర్స్ లో రిలీజ్ అయ్యేదాకా తెలియలేదు. మరి నాలుగో సినిమాగా రావాల్సిన మిస్టర్ పొలిశెట్టి.. మూడో సినిమాగా రావడం ఏంటి? అసలు మూడో సినిమా ఊసు లేకపోవడం ఏంటని జనాలలో కన్ఫ్యూషన్ మొదలైంది. ఎలాగోలా నవీన్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్టర్ పొలిశెట్టి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు. మరి అనగనగా ఒక రాజు కథ.. ఇంకా ఉందా లేదా? క్లారిటీ ఇస్తే బాగుంటుందని టాక్. మరి నవీన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss