అల్లు అర్జున్ కి అవార్డు వస్తే ఇంత ఏడుపా? వాళ్ళ పిచ్చి బాగా ముదిరింది!

  • Author ajaykrishna Updated - 03:24 PM, Fri - 25 August 23
  • Author ajaykrishna Updated - 03:24 PM, Fri - 25 August 23
అల్లు అర్జున్ కి అవార్డు వస్తే ఇంత ఏడుపా? వాళ్ళ పిచ్చి బాగా ముదిరింది!

భారత ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ సినీ పురస్కారాలలో.. బెస్ట్ యాక్టర్ అవార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని వరించిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రకటించగా.. అదే ఏడాది విడుదలైన పుష్ప సినిమాలో పుష్పరాజ్ క్యారెక్టర్ కి బన్నీ అవార్డు అందుకున్నాడు. కాగా.. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో దేశమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. కానీ.. కొందరు మాత్రం ఓ స్మగ్లర్ క్యారెక్టర్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం ఏంటని వాదనలు వినిపిస్తున్నారు. పుష్ప సినిమాని.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించాడు డైరెక్టర్ సుకుమార్.

దీంతో ఇప్పుడు ఓ స్మగ్లర్ క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు ఇవ్వడం ఏంటని చాలామంది ఏడుపు మొదలైంది. సోషల్ మీడియాలో స్మగ్లర్ పాత్రకు అవార్డు ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. వీరి బాధ అల్లు అర్జున్ కి అవార్డు వచ్చిందని కాబోలు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. కమర్షియల్ సినిమాలకు.. గ్యాంగ్ స్టర్ రోల్స్ కి అవార్డులు రావడం ఇండస్ట్రీలో కొత్త కాదు. ఓసారి గమనిస్తే.. సాగర సంగమం, స్వాతి ముత్యం సినిమాలతో గొప్ప నటుడిగా.. నాట్యకారుడిగా కమల్ హాసన్ కీర్తి పొందారు. అదే కమల్ హాసన్.. మణిరత్నం దర్శకత్వంలో ‘నాయకుడు’ అనే గ్యాంగ్ స్టర్ సినిమా చేశాడు. ఆ సినిమాకు గాను ఆయనకు నేషనల్ అవార్డు వరించింది.

అదేవిధంగా చూసుకుంటే.. 1997లో సురేష్ గోపి హీరోగా కలియట్టం అనే మలయాళం సినిమా తీశారు. ఆయన నటనకు నేషనల్ అవార్డు వచ్చింది. అలాగే 1999లో సంకోత్ బెన్ జడేజా అనే మహిళా గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా ‘గాడ్ మదర్’ అనే సినిమా తీశారు. ఇందులో ఆమె క్యారెక్టర్ పోషించి.. షబానా అజ్మి నేషనల్ అవార్డు అందుకున్నారు. పైన చెప్పుకున్న మూడు సినిమాలు గ్యాంగ్ స్టర్, క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కినవే. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. బెస్ట్ అవార్డు పొందిన వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్ చేశాడు అనేది కాదు. ఉత్తమ నటన కనబరిచాడా లేదా? ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశాడా లేదా? అనేది జ్యూరీ పరిగణలోకి తీసుకుంటుందని గమనించాలి.

పుష్పరాజ్ ఓ స్మగ్లర్.. గ్యాంగ్ స్టర్ కావచ్చు. కానీ.. ఆ పాత్ర పోషించి.. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినందుకు మాత్రమే అల్లు అర్జున్ ని అవార్డు వరించింది. జ్యూరీ కూడా అంత ఈజీగా ఎవరికి అవార్డు ఇవ్వరు కదా.. వారికంటూ రూల్స్, లిమిటేషన్స్ ఉంటాయి. వాటి ఆధారంగానే పుష్ప క్యారెక్టర్ కి అవార్డు ఇవ్వడం జరిగిందని గుర్తు పెట్టుకోవాలి. అవార్డులు అనేవి క్లాసిక్ సినిమాలకే కాదు.. పెర్ఫార్మన్స్ లు బట్టి.. కమర్షియల్ సినిమాలలో క్యారెక్టర్స్ కి కూడా వస్తుంటాయి. ఏదేమైనా పుష్ప క్యారెక్టర్ లో అల్లు అర్జున్ జీవించేశాడు. అందుకే వరల్డ్ మొత్తం ఆ క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అల్లు అర్జున్ కి ఎలా వస్తుంది? అని సో కాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో.. వారికి అవార్డుల కమిటీ గురించి, అక్కడి రూల్స్ గురించి అవగాహన లేదనుకుంటా. సో.. కామెంట్ చేసేముందు ఓసారి హిస్టరీలోకి వెళ్తే బెటర్ అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పుష్ప క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments