iDreamPost

గాండీవధారి అర్జున సినిమా రివ్యూ! ఎలా ఉందంటే?

గాండీవధారి అర్జున సినిమా రివ్యూ! ఎలా ఉందంటే?

‘గని’ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో.. తన ఆశలన్నీ ‘గాండీవధారి అర్జున’ సినిమాపైనే పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఈ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు సైతం ఘోస్ట్ మూవీ ఫ్లాప్ తో డీలా పడ్డారు. ఇలా వీరిద్దరు కలిసి గాండీవధార అర్జున మూవీ అనౌన్స్ చేయగానే అందరిలో ఆసక్తిపెరిగింది. పైగా టైటిల్ కూడా క్రేజీగా ఉండటం, ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? పెళ్లికి ముందు వరుణ్ కు హిట్ ఇచ్చిందా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథ:

ఇండియాకు చెందిన పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య రాజ్(నాజర్) లండన్ లో జరిగే యూఎన్ క్లైమెట్ మీటింగ్ కు వెళ్తాడు. అతడి వెంట పీఏగా ఐరా(సాక్షి వైద్య) కూడా వెళ్తుంది. అయితే అక్కడ ఓ యూనివర్సిటీకి చెందిన ఓ అమ్మాయి మంత్రిని కలిసి ‘ఫైల్ 13’ గురించి చెప్పాలనుకుంటుంది. ఇదే టైమ్ లో ఆ ఫైల్ 13 కోసం సీ అండ్ జీ కంపెనీ అధినేత రణ్ వీర్(వినయ్ రాయ్) ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ ఫైల్ 13లో ఏముంది? మంత్రికి రణ్ వీర్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆ క్లైమెట్ మీటింగ్ లో ఆ ఫైల్ సబ్మిట్ చేశాడా? ఈ కథకి, అర్జున్ వర్మ(వరుణ్ తేజ్)కు లింక్ ఏంటి? చివరికి ఆ ఫైల్ ఎవరి చేతికి చిక్కింది? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఎంచుకున్న పాయింట్ కొత్తదే. అయితే ఈ తరహా కథలు ఇంతకు ముందు చాలానే వచ్చాయి. మనం చూపించే కథ కొత్తది అయినప్పుడు.. దాని చుట్టూ అల్లుకునే సన్నివేశాలు కూడా అంతే కొత్తగా, ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఈ విషయంలో డైరెక్టర్ సఫలం కాలేదనే చెప్పాలి. ఫారెన్ లో ఉండే చెత్త, చెదారాన్ని ఇండియా తీసుకొచ్చి డంప్ చేయడం, ఇండియా వనరులను నాశనం చెయ్యడం, ప్లాస్టిక్ వాడకం ఎక్కువైతే కలిగే నష్టాలను డైరెక్టర్ టచ్ చేశాడు. ఇలాంటి మాఫియా కాన్సెప్ట్ ను తీసుకున్నప్పుడు.. ప్రేక్షకుడ్ని రెండున్నర గంటల పాటు కూర్చోబెట్టేలా సన్నివేశాలు రాసుకోవాలి. ఈ విషయంలో ప్రవీణ్ సత్తారు తడబడ్డారు. కథ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే.. ఈ మాఫియాను అరికట్టడమే అర్జున్ వర్మ పని.

అయితే ఈ సినిమా ఎక్కడా కొత్తగా అనిపించదు. పైగా తెరపై ఎంతో లగ్జరీ సీన్స్ కనిపించినప్పటికీ.. కథలో ఎమోషన్ వర్కౌట్ కాలేదు. కథలో ఎక్కడా ట్విస్టులు గానీ, టర్న్ లు గానీ లేకుండా కథను నడిపించాడు డైరెక్టర్. అతడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. సాధారణ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా మూవీని డిజైన్ చేయలేదు. ప్లాట్ గా సాగే నెరేషన్ ప్రేక్షకుడిని విసిగిస్తుంది. అదీకాక ఈ మూవీలో ఎక్కువ శాతం డైలాగ్స్ ఇంగ్లీష్ లో మాట్లాడతాయి. దీంతో ఏదో డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకుడికి. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ చూసి.. ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది అనుకున్న అభిమానులు మాత్రం తీవ్ర నిరాశ చెందడం పక్కా.

ఇక కథలో లాజిక్ లేని సన్నివేశాలు బోలెడు ఉన్నాయి. హీరో, విలన్ మీట్ అయ్యే లాస్ట్ షాట్ దాకా.. విలన్ కు హీరో ఎవరో తెలిదు.. అలాంటప్పుడు అతడు హీరోను విలన్ ఎలా టార్గెట్ చేయగలుగుతాడు. ఇలాంటి లాజిక్ లు ఈ మూవీలో చాలానే ఉన్నాయి. తొలి భాగం మెుత్తం ప్లాష్ బ్యాక్, హీరో లవ్ ఎపిసోడ్స్ తో సాగిపోతుంది. సెకండాఫ్ లో కథ పరిగెత్తినట్లుగా అనిపించినప్పటికీ.. ట్రెడ్ మిల్ పై ఉన్నట్లే ఉంటుంది. ఇక ఇంటర్ పోల్ అధికారులు హీరోని పట్టుకోవడంలో చూపిన ఇంట్రెస్ట్.. విలన్ ను పట్టుకోవడం ఎందుకు చూపరో ప్రేక్షకులకు అర్ధం కాదు. ఇలా ఎన్నో సీన్లు ప్రేక్షకుడికి ఓ మిస్టరీ ప్రశ్నలుగా మిగిలిపోయి.. సమాధానం తెలుసుకునే సరికి సినిమా కాస్త ఎండింగ్ అవుతుంది.

ఎవరెలా చేశారంటే?

అర్జున్ వర్మ పాత్రలో వరుణ్ చేసిన యాక్షన్ సన్నివేశాలు అబ్బురపరుస్తాయి. ఈ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు వరుణ్ తేజ్. సినిమా మెుత్తాన్ని తన భుజాలపై వేసుకుని నడిపించాడనే చెప్పాలి. ఇక హీరోయిన్ గా సాక్షి వైద్య చాలా బాగా యాక్ట్ చేసింది. ఆమెను సరిగ్గా ప్రజెంట్ చేయడంలో దర్శకుడు విఫలం అయినట్లుగా కనిపిస్తుంది. గ్లామర్ పరంగా సాక్షి మెప్పించగా.. నాజర్ మరోసారి తనలో ఉన్న నటుడిని బయటకి తీశాడు. విలన్ గా వినయ్ రాయ్ ఏ మాత్రం ప్రభావం చూపలేదనే చెప్పాలి. కమెడియన్ అభినవ్ గోమఠం అలా కనిపించి ఇలా వెళ్లిపోతాడు. మూవీలో మిగతా పాత్రలు తమ పరిధిమేర నటించాయి. ఈ మూవీకి ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే టెక్నికల్ విభాగం అనే చెప్పాలి. కెమెరా పనితం సూపర్ అనే చెప్పాలి. ఇక మ్యూజిక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారని సీన్లు చూస్తేనే తెలుస్తుంది. యాక్షన్ సీన్లు అబ్బురపరుస్తాయి. చివరిగా బాక్సాఫీస్ వద్ద ‘ఈ గాండీవధారి గాడి తప్పాడు’

బలాలు

  • వరుణ్ తేజ్ నటన
  • యాక్షన్ సీన్లు

బలహీనతలు

  • స్లో నెరేషన్
  • లాజిక్ లేని సీన్లు
  • మ్యూజిక్

(గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)