iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 5 న ఎవరిది అప్పర్ హ్యాండ్ ?

  • Published Sep 01, 2025 | 11:02 AM Updated Updated Sep 01, 2025 | 11:02 AM

అదేంటో తెలియదు కానీ ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఏ నెలకు ఆ నెల ఈ నెల బావుంటుంది.. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దద్దరిల్లిపోతాయని ఆశపడడమే తప్ప.. సరైన ఫలితాలు రావడం లేదు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల మొదలైంది

అదేంటో తెలియదు కానీ ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఏ నెలకు ఆ నెల ఈ నెల బావుంటుంది.. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దద్దరిల్లిపోతాయని ఆశపడడమే తప్ప.. సరైన ఫలితాలు రావడం లేదు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల మొదలైంది

  • Published Sep 01, 2025 | 11:02 AMUpdated Sep 01, 2025 | 11:02 AM
సెప్టెంబర్ 5 న ఎవరిది అప్పర్ హ్యాండ్ ?

అదేంటో తెలియదు కానీ ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఏ నెలకు ఆ నెల ఈ నెల బావుంటుంది.. కచ్చితంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దద్దరిల్లిపోతాయని ఆశపడడమే తప్ప.. సరైన ఫలితాలు రావడం లేదు. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల మొదలైంది. ప్రస్తుతం ఈ నెల 25 న ఓజి సినిమా రిలీజ్ ఉంది కాబట్టి.. ఈ సినిమా మీదే కోటి ఆశలు పెట్టుకున్నారు థియేటర్ ఓనర్లు. అట్లీస్ట్ ఇదైనా వీరి ఆశలు నెరవేరేస్తుందో లేదో చూడాలి. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అయితే బాగానే ఉంది. కానీ మొదటి షో రిలీజ్ అయ్యేవరకు బొమ్మ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడే ఓ అంచనాకు రాలేము.

ఆల్రెడీ భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాల విషయంలో ఏమి జరిగిందో చూశాము. కాబట్టి ఎంత పవన్ కళ్యాణ్ ఓజి అయినా సరే ఈసారి మాత్రం వంద శాతం అంచనాలు పెట్టుకోము అంటున్నారు ప్రేక్షకులు. ఇక సెప్టెంబర్ నెల మొదటి వారంలో మొత్తం నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంట్రీ ఇస్తున్నాయి. సెప్టెంబర్ 5 న అనుష్క ‘ఘాటీ’ , సోషల్ మీడియా స్టార్ మౌళి నటించిన ‘లిటిల్ హార్ట్స్’ , శివ కార్తికేయన్ ‘మదరాసి’ , హాలీవుడ్ హారర్ మూవీ ‘ది కంజురింగ్ ఫైనల్ రైట్స్’ ని డబ్బింగ్ వెర్షన్ , . కాంట్రావర్సిని మోసుకొస్తున ‘ది బెంగాల్ ఫైల్స్’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

వీటిలో ఘాటీ , లిటిల్ హార్ట్స్ సినిమాల మీద మంచి బజ్ వినిపిస్తుంది. ఒకవేళ టాక్ బావుంటే కనుక ఈ రెండు సినిమాలు ఈ వారం ఆడియన్స్ చాయిస్ లో యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక శివకార్తికేయన్ మదరాసి కూడా టాక్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. మిగిలిన రెండు సినిమాలు ఆడియన్స్ కు ఆప్షన్స్. మరి ఈ సినిమాలను థియేటర్స్ వరకు వెళ్లి చూస్తారో లేదా ఓటిటి లో వచ్చే వరకు వెయిట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇన్ని సినిమాలలో ఈ వారం ఏ సినిమా ఆధిపత్యం చలాయిస్తుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.