iDreamPost
android-app
ios-app

కల్కి 2898ఏడీలో కొత్త పోస్టర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా..? మామూలు బ్యాగ్రౌండ్ కాదు

కల్కి 2898ఏడీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లను షురూ చేసింది టీం. ఇప్పటికే ముంబయిలో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఇప్పుడు క్యారెక్టర్స్ లుక్స్ రివీల్ చేస్తుంది. తాజాగా మరో కీలక రోల్ చేసిన నటి పోస్టర్ పంచుకుంది. ఇంతకు ఆమె ఎవరంటే.?

కల్కి 2898ఏడీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో ప్రమోషన్లను షురూ చేసింది టీం. ఇప్పటికే ముంబయిలో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఇప్పుడు క్యారెక్టర్స్ లుక్స్ రివీల్ చేస్తుంది. తాజాగా మరో కీలక రోల్ చేసిన నటి పోస్టర్ పంచుకుంది. ఇంతకు ఆమె ఎవరంటే.?

కల్కి 2898ఏడీలో కొత్త పోస్టర్‌లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా..?  మామూలు బ్యాగ్రౌండ్ కాదు

డార్లింగ్ ప్రభాస్ మోస్ట్ ఎవటైడె మూవీ కల్కి 2898ఏడీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లను షురూ చేసింది చిత్ర యూనిట్. టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అలాగే ఇండస్ట్రీలో కీలక పాత్రలు పోషిస్తున్న యాక్టర్స్ లుక్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది చిత్ర యూనిట్. మొన్న శోభన క్యారెక్టర్ రివీల్ చేయగా.. ఆ తర్వాత అన్నాబెన్ లుక్ రిలీజ్ చేసింది. ‘ది లక్కీ రెబల్’ అంటూ ఆమె కైరా క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లు గురువారం సాయంత్రం ఆ పోస్టర్ పంచుకుంది. ఇంతకు కైరా పాత్ర పోషిస్తున్న అన్నాబెన్ ఎవరు.. ఇంతకు ముందు ఏ సినిమాలు చేసింది అంటూ సెర్చ్ చేస్తున్నారు.

మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రావడం కొత్త కాదు. ఏటా అనేక మంది కేరళ బ్యూటీలు తెలుగులోకి తెరంగేట్రం చేస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. అలా తన లక్‌ను పరీక్షించుకునేందుకు వస్తుంది అన్నా బెన్. మలయాళ సినిమాలు రెగ్యులర్ వాచ్ చేసే వాళ్లకు అన్నాబెన్ సినిమాలు చూసే ఉంటారు. అక్కడ ఆమె స్టార్ హీరోయిన్. ప్రభాస్ మూవీతో ఇక్కడ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తుంది ఈ ఉంగరాల జుట్టు పిల్ల. ప్రముఖ మలయాళ స్క్రీన్ రైటర్ బెన్నీ పి నాయరాంబళం కుమార్తెనే అన్నాబెన్. కొచ్చికి చెందిన బెన్ అక్కడ ఫ్యాషన్ అండ్ అపెరల్ డిజైనింగ్‌లో పట్టా పొందింది. సినీ నేపథ్యం ఉండటంతో చిన్నప్పటి నుండి నటనపై ఆసక్తిని పెంచుకుంది ఈ మాలీవుడ్ సోయగం.

మలయాళ స్టార్స్ పహాద్ ఫజిల్,మంజుమ్మల్ బాయ్స్ చిత్రంతో ఫేమస్ అయిన సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ బాసి నటించిన కుంబలంగి నైట్స్ మూవీతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పహాద్ ఫజిల్ మరదలి పాత్రలో మెప్పించింది. ఉత్తమ నటిగా సైమా, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుతో సహా పలు పురస్కారాలు అందుకుంది. హెలెన్, కప్పేలా వంటి చిత్రాలతో హిట్ అందుకుంది. హెలెన్ హిందీలో రీమేక్ కాగా, జాన్వీ కపూర్ మెయిన్ రోల్ చేసింది. సారా, నారదన్, నైట్ డ్రైవ్, కప్ప, త్రిశంకు వంటి చిత్రాలు చేసి స్టార్ డమ్ సంపాదించుకుంది. తమిళంలో ద అడమెంట్ గర్ల్ చేసింది. డీ గ్లామర్ రోల్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇది 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. చేసిన కొన్ని సినిమాలే అయినా.. ప్రతి మూవీలోనూ తనదైన ముద్రను చూపిస్తుంది. ఇప్పుడు కల్కి మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమాలో తాను నటించడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని, చేసింది చిన్నపాత్రే అయినా.. ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపుతుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక కల్కి మూవీలో దీపికా, దిశా, అమితాబ్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, శోభన వంటి స్టార్స్ నటిస్తున్న సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి