PT ఉషానే ఓడించిన స్ప్రింటర్ అశ్వినీ నాచప్ప ఎక్కడ.. ఏం చేస్తున్నారు..?

ఒలింపిక్స్ క్రీడలు ముగిసిపోయాయి. భారత్ క్రీడాకారులు తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అలాగే రెజ్లర్ వినేశ్ ఫోగట్ చివరి మెట్టుపై అనూహ్యంగా క్రీడల నుండి వైదొలగాల్సి వచ్చింది. ఇలా స్ట్రగుల్ పడి.. చివరకు స్పోర్ట్ నుండే క్విట్ అయిన అశ్వినీ నాచప్ప గుర్తుందా..?

ఒలింపిక్స్ క్రీడలు ముగిసిపోయాయి. భారత్ క్రీడాకారులు తన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. అలాగే రెజ్లర్ వినేశ్ ఫోగట్ చివరి మెట్టుపై అనూహ్యంగా క్రీడల నుండి వైదొలగాల్సి వచ్చింది. ఇలా స్ట్రగుల్ పడి.. చివరకు స్పోర్ట్ నుండే క్విట్ అయిన అశ్వినీ నాచప్ప గుర్తుందా..?

పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్ క్రీడలకు తెరపడింది. 16 రోజుల పాటు క్రీడా అభిమానులను ఉర్రతలూగించాయి. ఈ ఒలింపిక్స్‌లో అత్యధిక పథకాలను కైవసం చేసుకుని అగ్ర రాజ్యం అమెరికా తొలి స్థానంలో నిలిచింది. చైనా, జపాన్ దేశాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇండియా ఈ సారి 71వ స్థానంతో సరిపెట్టుకుంది. భారత్ ఒక్క గోల్డ్ మెడల్ కూడా దక్కించుకోలేదు. ఐదు బ్రౌంజ్, ఓ సిల్వర్ మెడల్స్ సాధించింది. ఇక అనర్హత వేటు పడ్డ వినేశ్ ఫోగాట్ అంశం కోర్టులో విచారణ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆమె ఒలింపిక్ పతకాన్ని గెలవకపోయినా.. ఇండియన్స్ మనస్సు గెలిచింది. ఇప్పుడే కాదు.. ఒకప్పుడు కూడా ఒలింపిక్స్, అంతర్జాతీయ గేమ్స్‌లో పాల్గొని విజేత కాలేకపోయినప్పటికీ.. తన ఆటతీరుతో ఆకట్టుకున్న క్రీడాకారిణి అశ్విని నాచప్ప. పరుగుల రాణి పీటీ ఉషను ఓడించి.. ఒక్కసారిగా లైమ్ లైట్‌లో నిలిచింది. ప్రస్తుతం ఆమె ఎలా ఉన్నారంటే..? ఏం చేస్తున్నారో చూద్దాం.

1967లో కర్ణాటకలోని కొడుగు జిల్లాలో జన్మించింది. ఓ మారు మూల ప్రాంతంలో పుట్టిన మట్టిలో మాణిక్యం. ఆమె హార్డలర్‌గా కెరీర్ స్టార్ చేసి ఆ తర్వాత స్రింటర్‌గా మారింది. ట్రాక్ పై ఆమె వేగాన్ని చూసిన సునీల్ అబ్రహం అనే కోచ్ ఆమెకు శిక్షణ ఇచ్చాడు. ఆమెను పరుగుల పందెంలో తీర్చిదిద్దాడు. 100మీ, 200 మీ, 400మీ ఈవెంట్లలో ఆమె ఎన్నోపతకాలు గెలిచింది. పరుగులు రాణి పీటీ ఉషకే గట్టిపోటీనిచ్చింది. 1991లో న్యూఢిల్లీలో జరిగిన ఓపెన్ నేషనల్స్‌లో ఆమె పీటీ ఉషను ఓడించడంతో ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకుంది. అలా అంతర్జాతీయ వేదికలపై ఎన్నోపతకాలను సొంతం చేసుకుంది. అలా ఇండియన్ ఫోజో (అమెరికన్ అథ్లెట్)  అర్జున అవార్డును అందుకుంది. సియోల్ ఒలింపిక్స్‌కు ఎన్నికైనా.. అయితే ఆమెను రిజర్వ్‌లో ఉంచారు. తర్వాత బార్సిలోనా ఒలింపిక్స్‌లో గాయం కారణంగా పాల్గొనలేకపోయింది. అప్పట్లో ఉన్న రాజకీయాలను తట్టుకోలేక పూర్తిగా క్రీడలకు స్వస్తి పలికింది.

పూర్తిగా భిన్నమైన కెరీర్‍లోకి అడుగుపెట్టింది అశ్విని నాచప్ప. పీటీ ఉషను ఓడించాక.. ప్రముఖ నిర్మాత రామోజీరావు ఆమెను సంప్రదించి తన సినిమాలో యాక్ట్ చేయాలని కోరాడు. నటన తనకు రాదని చెప్పినా.. ఒప్పించి.. తన జీవిత కథ ఆధారంగా అశ్వినీ అనే మూవీ తెరకెక్కించాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఆదర్శం, ఇన్ స్పెక్టర్ అశ్వినీ, మిస్ 420, అందరూ అందరే వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. అయితే ఇది తన రంగం కాదని నమ్మిన ఆమె.. తన సొంత గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేసి.. పాఠాలతో పాటు అశ్వినీ స్టోర్స్ ఫౌండేషన్ పేరుతో ఆటల్లోనూ శిక్షణనిస్తోంది. ఎప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నా.. పోటీదారులకు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతూ ఉంటుంది. అలాగే తాజాగా వినేశ్ ఫోగట్ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించగా.. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపింది అశ్వినీ నాచప్ప. ఆమెకు ఇద్దరు కూతుళ్లు..అమీషా, దీపాలి. వీళ్లు కూడా క్రీడారంగంలో రాణిస్తున్నారని సమాచారం.

Show comments