iDreamPost
android-app
ios-app

వినేశ్ ఫోగట్ కు ఊరట.. సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేయొచ్చు అన్న పారిస్ స్పోర్ట్స్ కోర్టు!

Paris Sports Court Supports Vinesh Phogat Petition For Silver Medal: భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కు పారిస్ స్పోర్ట్స్ కోర్టు శుభవార్త తెలియజేసింది. తాను సిల్వర్ మెడల్ కోసం పోరాటం చేయచ్చు అని పారిస్ స్పోర్ట్స్ కోర్టు ప్రకటించింది. ఆమె పిటిషన్ కు మద్దతు తెలిపింది.

Paris Sports Court Supports Vinesh Phogat Petition For Silver Medal: భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ కు పారిస్ స్పోర్ట్స్ కోర్టు శుభవార్త తెలియజేసింది. తాను సిల్వర్ మెడల్ కోసం పోరాటం చేయచ్చు అని పారిస్ స్పోర్ట్స్ కోర్టు ప్రకటించింది. ఆమె పిటిషన్ కు మద్దతు తెలిపింది.

వినేశ్ ఫోగట్ కు ఊరట.. సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేయొచ్చు అన్న పారిస్ స్పోర్ట్స్ కోర్టు!

వినేశ్ ఫోగట్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన రెజ్లర్ గురించే చర్చ జరుగుతోంది. ఒలింపిక్స్ లో వీరోచితంగా పోరాడి.. ఫైనల్ కు చేరి కూడా.. వంద గ్రాముల అధిక బరువు కారణంగా వినేశ్ ఫోగట్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమెకు కనీసం సిల్వర్ మెడల్ కూడా దక్కదు అని చెప్పేశారు. ఎందుకంటే ఫైనల్ లో డిస్క్వాలిఫై అయ్యింది కాబట్టి ఎలాంటి మెడలు అనేది రాదు అని చెప్పారు. ఈ విషయంలో యావత్ ప్రపంచమే విస్తుపోయింది. భారతదేశ ప్రముఖులు, సెలబ్రిటీలు, అథ్లెట్స్ మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్స్ కూడా వినేశ్ ఫోగట్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఈ విషయంపై వినేశ్ ఫోగట్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు సానుకూలంగా స్పందించింది.

వినేశ్ ఫోగట్ కు పారిస్ స్పోర్ట్స్ కోర్టులో భారీ ఊరట లభించింది. తనకు కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలి అంటూ తాను పారిస్ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రియించింది. అలాగే తాను అసలు వెయిట్ ఎలా పెరిగింది? తాను ఆ బరువును తగ్గించుకోవడానికి ఎలాంటి కఠినతర విధానాలు అవలభించింది? ఆ తర్వాత తాను ఎలా ఆస్పత్రి పాలైంది అనే విషయాలను కోర్టుకు సవివరంగా తెలియజేసింది. వినేశ్ ఫోగట్ పిటిషన్ చూసిన కోర్టు తనకు మద్దతు తెలిపింది. వినేశ్ ఫోగట్ సిల్వర్ మెడలు కోసం అర్హురాలే అనే విషయాన్ని వెల్లడించింది. తాను సిల్వర్ మెడల్ కోసం పోరాడొచ్చని తెలిపింది. అయితే ఈ విషయంలో పారిస్ కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వినేశ్ కు సంబంధించి సమగ్ర విచారణ జరపమని చెబుతుందా? లేదా సిల్వర్ మెడల్ ఇవ్వాలని ఒలింపిక్ కమిటీకి సూచిస్తుందా? అనే విషయాలపై మాత్రం సందిగ్ధత నెలకొంది.

వినేశ్ ఫోగట్ సిల్వర్ మెడల్ కోసం పూర్తి విధంగా అర్హురాలు అని పారిస్ కోర్టు చెప్పడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెజర్లు కూడా వినేశ్ కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. బరువు విషయంలో 100 గ్రాముల నుంచి 200 గ్రాములకు మినహాయింపు ఉండాలని కోరుతున్నారు. అలాగే పురుషులు, మహిళలకు ఒకే రకమైన రూల్స్ ఉండటం కూడా కరెక్ట్ కాదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒలింపిక్స్ కోసం ఒక దేశం నుంచి క్రీడాకారులు మరో దేశానికి వెళ్తారు. అక్కడ వాతావరణం మారటం, వరుస మ్యాచులు, విభిన్నమైన ఆహారం కూడా బరువు మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. వినేశ్ ఫోగట్ కి మెడల్ ఇవ్వకపోవడాన్ని మరోసారి సమీక్షించాలి అనే విషయంపై కమిటీని కోర్టు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినేశ్ ఫోగట్ కు సిల్వర్ మెడల్ ఇవ్వాలని పారిస్ కోర్టు చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.