iDreamPost
android-app
ios-app

వీడియో: బ్రాంజ్ మెడల్ నెగ్గిన భారత హాకీ జట్టు.. హీరోగా గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్

Paris Olympics 2024- Indian Hockey Team Clinched Bronze Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియన్ హాకీ టీమ్ సత్తా చాటింది. ఫైనల్స్ చేరలేకపోయినా కూడా.. స్పెయిన్ మీద అద్భుతమైన విజయంతో పతకం పట్టేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అద్భుతం చేశారు.

Paris Olympics 2024- Indian Hockey Team Clinched Bronze Medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియన్ హాకీ టీమ్ సత్తా చాటింది. ఫైనల్స్ చేరలేకపోయినా కూడా.. స్పెయిన్ మీద అద్భుతమైన విజయంతో పతకం పట్టేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అద్భుతం చేశారు.

వీడియో: బ్రాంజ్ మెడల్ నెగ్గిన భారత హాకీ జట్టు.. హీరోగా గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్

పారిస్ ఒలిపింక్స్ 2024లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. సెమీ ఫైనల్స్ లో ఓటమిపాలై.. ఫైనల్స్ చేరలేకపోయిన భారత హాకీ జట్టు ఇప్పుడు పతకాన్ని పట్టేసింది. స్పెయిన్ తో జరిగిన బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. 2-1 తేడాతో స్పెయిన్ పై విజయం సాధించి.. బ్రాంజ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది. అభిమానులు మొత్తం ఎలాగైతే ది వాల్ గా పిలుచుకునే గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ మీద ఆశలు పెట్టుకున్నారో.. అలాగే పతకం రావడంలో శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. గోల్ పోస్టుల మధ్య గోడలా నిలబడి.. స్పెయిన్ ఆటగాళ్లు గోల్ చేయకుండా కట్టడి చేశాడు. మొత్తానికి భారత్ హాకీ టీమ్ అయితే తమ ఖాతాలో ఒక పతకాన్ని వేసుకుంది.

సెమీ ఫైనల్స్ లో ఓటమి తర్వాత భారత హాకీ టీమ్, అభిమానులు అంతా స్పెయిన్ తో జరిగే బ్రాంజ్ మెడల్ మ్యాచ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందరూ ఆకాంక్షించిన విధంగానే బ్రాంజ్ మెడల్ ను భారత జట్టు సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా కూడా సాగింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్(30వ నిమిషం, 33వ నిమిషం) చేసి టీమిండియాకి కీలక విజయాన్ని అందించాడు. మ్యాచ్ సమురీ చూస్తే.. తొలి క్వార్టర్ లో ఇరు జట్లకు ఎలాంటి గోల్స్ రాలేదు. రెండో క్వార్టర్ స్టార్టింగ్ లో స్పెయిన్ ఆటగాడు పెనాల్టీ స్ట్రోక్ ని గోల్ గా మరిచి.. స్పెయిన్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తర్వాత టీమిండియా కెప్టెన్ కు పెనాల్టీ కార్నర్ రూపంలో గోల్ చేసే అవకాశం దక్కినా కూడా స్పెయిన్ కీపర్ దానిని అడ్డుకున్నాడు. తర్వాత వెంటనే భారత్ కు మరో పెనాల్టీ లభించింది. దానిని గోల్ గా మలచడంలో టీమిండియా సఫలీకృతమైంది. దాంతో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి.

మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే కెప్టెన్ మరో గోల్ చేసి టీమిండియాని ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. తర్వాత 3 పెనాల్టీ కార్నర్ లు వచ్చినా కూడా వాటిని టీమిండియా గోల్స్ గా మలచలేకపోయింది. ఆట మరో నిమిషంలో ముగియబోతోంది అనగా.. స్పెయిన్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. దానిని ఎలాగైనా గోల్ గా మలిచి గోల్స్ సమం చేయాలని స్పెయిన్ భావించింది. కానీ, టీమిండియా గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ దానిని సమర్థంగా ఎదుర్కొని భారత హాకీ జట్టుకు విజయాన్ని అందించాడు. 1968, 1972లో టీమిండియాకి వరుసగా హాకీలో బ్రాంజ్ మెడల్స్ దక్కాయి. మళ్లీ ఇప్పుడు 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్ లో హాకీలో బ్రాంజ్ మెడల్ దక్కింది. మరి.. కామెంట్స్ రూపంలో భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేయండి.