Swetha
Choreographer Johnny Master -14 days remand Time: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది. ఇప్పుడు దీనిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Choreographer Johnny Master -14 days remand Time: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది. ఇప్పుడు దీనిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Swetha
ప్రస్తుతం అందరికి జానీ మాస్టర్ కేసుపైన తీవ్ర ఆసక్తి నెలకొంది. తన కెరీర్ లో ఇప్పటివరలు ఎన్నడూ లేని విధంగా జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ ఉన్న పరిస్థితులపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ ను విధించింది. అలాగే ఈ వివాదం మొదలైన తర్వాత మొదటి సారి జానీ మాస్టర్ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియోలు కూడా మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అసలు జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ ఎందుకు విధించింది. అనే అంశంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.
ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ క్రమంలోనే తానూ ఏ తప్పు చేయలేదని.. తానూ ఎవరి పైన లైంగిక దాడికి పాల్పడలేదని.. కావాలనే ఎవరో తనపై ఇలాంటి కుట్ర పన్నారని అన్నారు. అంతే కాకుండా న్యాయ పోరాటం చేసి నిజాయితీగా బయటకు వస్తానని కూడా తెలియజేశారు. ఆయన మాటల్లో ఎంత వరకు నిజాయితీ ఉందో లేదో తెలియదు. కానీ ఆయన చెప్పిన మాటలను బట్టి.. నెటిజన్లలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఆయనకు 14 రోజుల రిమాండ్ ఎందుకు విధించారు. లై డిటెక్టర్ టెస్ట్ చేస్తారా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. సాధారణంగా పోలీసులు సాక్ష్యాలను సేకరించే పలు సంధర్భాలలో లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. సాక్ష్యం లేకపోయినా.. లేదా ఆ కేసు అత్యంత కీలకం అయితే ముద్దాయిని ఇన్వెస్టిగేట్ చేసేందుకు ఈ టెస్ట్ ను నిర్వహిస్తారు. పోలీసులు అడిగే ప్రశ్నలకు ముద్దాయి చెప్పే సమాధానాలు , స్పందించే తీరుని బట్టి.. ఫలితాలను అంచనా వేస్తారు. మరి జానీ మాస్టర్ కు కూడా ఈ టెస్ట్ ను నిర్వహించనున్నారా..అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇలాంటి ప్రశ్నలు తలెత్తడంతో ఆశ్చర్యపోవాల్సిందేమి లేదు. ఎందుకంటే మొదటి నుంచి ఈ కేసులో విక్టిమ్ కే సపోర్ట్ ఎక్కువ ఉంది. అయినా సరే జానీ మాస్టర్ పోలీసులకు పట్టు బడిన తర్వాత.. మీడియా ముందుకు వచ్చినప్పుడు.. చాలా నమ్మకంగా న్యాయపరంగానే తానూ బయటకు వస్తానని చెప్పాడు. అలాగే ఎవరో కావాలనే తనపై కుట్ర పన్నినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. దీనితో ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది. నిజంగానే జానీ మాస్టర్ నిజం చెప్తున్నడా.. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అని భావిస్తున్నారు నెటిజన్లు. మరి ఈ 14 రోజుల రిమాండ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. ఇంకా ఈ కేసులో ఎలాంటి కొత్త విషయాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది. ఒకవేళ జానీ మాస్టర్ ది తప్పు ఉంటే కనుక.. కనీసం ఏడేళ్ల పాటు జైలు శిక్ష అమలయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు . ఏమౌతుంది చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.