iDreamPost
android-app
ios-app

వార్ 2 పై స్పెషల్ కేర్.. అందుకేనా !

  • Published May 24, 2025 | 12:20 PM Updated Updated May 24, 2025 | 12:20 PM

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ కాబట్టి టీజర్ కు రికార్డ్స్ బద్దలవుతాయి , వ్యూస్ అదిరిపోతాయి అనుకున్నారు మేకర్స్. కానీ అది అసలు జరగలేదు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు వార్ 2 టీం వాళ్ళ తప్పులను సరిదిద్దుకునే పనిలో ఉన్నారట.

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ కాబట్టి టీజర్ కు రికార్డ్స్ బద్దలవుతాయి , వ్యూస్ అదిరిపోతాయి అనుకున్నారు మేకర్స్. కానీ అది అసలు జరగలేదు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు వార్ 2 టీం వాళ్ళ తప్పులను సరిదిద్దుకునే పనిలో ఉన్నారట.

  • Published May 24, 2025 | 12:20 PMUpdated May 24, 2025 | 12:20 PM
వార్ 2 పై స్పెషల్ కేర్.. అందుకేనా !

రీసెంట్ గా వార్ 2 నుంచి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మాట నూటికి నూరుపాళ్లు నిజం. ఆన్ అండ్ యావరేజ్ గా మూవీ టీజర్ కు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ అది కల్ట్ ఫ్యాన్ ఫాలోవర్స్ ను కన్విన్స్ చేయలేదు అన్న మాట వాస్తవం. దీనితో సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని ట్రోల్ల్స్ వినిపించాయి. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్ కాబట్టి టీజర్ కు రికార్డ్స్ బద్దలవుతాయి , వ్యూస్ అదిరిపోతాయి అనుకున్నారు మేకర్స్. కానీ అది అసలు జరగలేదు. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు వార్ 2 టీం వాళ్ళ తప్పులను సరిదిద్దుకునే పనిలో ఉన్నారట.

టీజర్ కు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను సీరియస్ గా తీసుకుని దేని గురించి ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయో.. వాటి మీద మరోసారి వర్క్ చేయాలనీ డిసైడ్ అయ్యారట. దానిలో ముఖ్యంగా VFX గురించి ఎక్కువ కామెంట్స్ వినిపించాయట . టీజర్ ఎడిటింగ్ సరిగా జరగలేదని.. హడావిడిగా టీజర్ కట్ చేయడం వలన.. అనుకున్నంత ఇంపాక్ట్ రాలేదని మూవీ టీం ఇప్పుడు ఫీల్ అవుతున్నారట. కానీ ఇలా తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోవడంలోనే అసలైన నిబద్దత కనిపిస్తుంది. అది అంతే అని వదిలేయకుండా మూవీ టీం దానిని కన్సిడర్ చేసి రీఎడిట్ చేయడం అనేది చెప్పుకోదగిన విషయం. ఇక మరోవైపు వార్ 2 కు మరో సమస్య ముంచుకొస్తుంది. అదే కూలి మూవీ. ఈ సినిమా మీద రోజు రోజుకి హైప్ పెరిగిపోతుంది.

చిన్న చిన్న టీజర్స్ రిలీజ్ చేసి కూలి మీద హైప్ పెంచేసాడు లోకేష్ కనగరాజ్. ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత అంచనాలు ఏ మాత్రం పెరుగుతాయో ఊహించడమే కష్టం. సో ఈ రెండు సినిమాలు పోటా పోటీగా బరిలో దిగుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలను క్రేజ్ బాగానే ఉన్నా కానీ.. ఇప్పటివరకు వినిపిస్తున్న కథనాల ప్రకారం.. బయ్యర్ల నుంచి రేట్ల పరంగా డిమాండ్ ఎక్కువగా కూలికే వస్తోందట. సో ఇవన్నీ తుడిచిపెట్టుకుపోవాలంటే వార్ 2 కు ఇప్పుడు ఓ సాలిడ్ ట్రైలర్ కట్ కావాలి. ఇక మేకర్స్ ఈసారి ఎలాంటి అవుట్ పుట్ ను ఇస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.